Breaking News

నాడు–నేడు రెండో దశ స్కూళ్లలోనూ డిజిటల్‌ విద్య 

Published on Sat, 07/15/2023 - 04:49

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను అత్యున్నత స్థాయి బోధన ద్వారా గ్లోబల్‌ సిటిజన్లుగా తీర్చి దిద్దాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పం. అందుకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ విద్యకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలి దశ నాడు–నేడు స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు 30,230 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ)ను ఏర్పాటు చేస్తున్నారు.

1 నుంచి 5 వ తరగతి స్కూళ్లలో 10,038 స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా నాడు–నేడు రెండో దశ స్కూళ్లలో కూడా ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీల ఏర్పాటుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ స్కూళ్లలో  డిజిటల్‌ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ జిల్లా విద్యా శాఖ అధికారులు (డీఈవోలు), అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ల (ఏపీవో)కు శుక్రవారం ఆదేశాలిచ్చారు.  

రెండో దశలో పనులు పూర్తి చేసుకున్న అన్ని స్కూళ్లకు ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌ టీవీలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి 60 మంది పిల్లలకు ఒక స్మార్ట్‌ టీవీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌ టీవీలను బోధనా తరగతి గదుల్లో మాత్రమే అమర్చాలన్నారు.  డిజిటల్‌ మౌలిక సదుపాయాల పనులను వెంటనే చేపట్టి ఆగస్టు నెలాఖరుకి పూర్తి చేయాలని డీఈవోలు, ఏపీవోలను ఆదేశించారు. ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌ టీవీలకు అవసరమైన కేబులింగ్, ఇతర ఏర్పాట్లకు అంచనాలు రూపొందించాలని, రెండో దశలో అందుబాటులో ఉన్న నిధులతో వాటిని అమర్చాలన్నారు. ఏఐఎఫ్‌పీలు, స్మార్ట్‌ టీవీలకు సమీపంలో రెండు సాకెట్లు, స్విచ్‌లతో కూడిన రెండు సాకెట్‌ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రాడ్‌ బ్యాండ్‌ సిగ్నల్‌ పాయింట్‌ అన్ని తరగతి గదుల మధ్యలో ఉంచాలని తెలిపారు.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)