Breaking News

భర్తను కాదని.. వేరే వ్యక్తితో పరిచయం..!

Published on Wed, 06/18/2025 - 11:53

భీమునిపట్నం: భీమిలిలో నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మంగళవారం బీచ్‌రోడ్డులోని జీడి తోటలో శవమై కనిపించింది. కృష్ణాకాలనీకి చెందిన బంగారు కవిత (28) గత నెల 10న సరకులు తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె భర్త పైడిరాజు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కవిత అదృశ్యంపై ఆమె భర్త, కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. కాగా.. బీచ్‌రోడ్డులోని మార్లిన్‌ కే రెస్టారెంట్‌ ఎదురుగా ఉన్న జీడి తోటలో ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న మహిళ తల, వేరుపడిన శరీరం ఉండడాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ తిరుమలరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

హత్య? ఆత్మహత్య? 
కవిత మృతి విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనేది తేలాల్సి ఉంది. అదృశ్యమైన ఒకటి, రెండు రోజుల్లోనే ఆమె చనిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. మంగళవారం వరకు మృతదేహం ఎవరికీ తెలియకపోవడంతో తల నుంచి శరీరం నేల మీద పడిపోయి, బాగా పాడైపోయిన స్థితిలో ఉంది. దీంతో పోస్టుమార్టంను అక్కడే నిర్వహించారు.

పోలీసుల దర్యాప్తులో ఆమెకు ఒక వ్యక్తితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఏదైనా గొడవలు జరిగి ఇక్కడకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడిందా, లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు సరైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు బీచ్‌రోడ్డులో నిరసన తెలిపారు.

 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)