Breaking News

మద్దతు లేక మొక్కజొన్న రైతులకు రూ.400 కోట్ల నష్టం

Published on Tue, 11/18/2025 - 04:53

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొక్కజొన్న కొను­గోలు కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందని ఏపీ వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మద్దతు ధర దక్కక రైతులు కన్నీరు పెడుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రైతులు మొక్కజొన్నను తక్కువ ధరకు అమ్ముకుంటున్నా కొనుగోలు కేంద్రాలు తెరవకుండా... రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ధరలు పడిపోయినప్పుడు రైతుల వద్ద కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్న కనీస బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

మొక్కజొన్నకు కేంద్రం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,400 ప్రకటించగా.. రాష్ట్రంలో రైతులు క్వింటా రూ.1,700 నుంచి రూ.1,900కు అమ్ముకుంటున్న దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మొక్కజొన్న రైతులు రూ.400 కోట్లకుపైగా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. పొరుగున ఉన్న తెలంగాణలో 120 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, ఎకరాకు 25 క్వింటాళ్ల వంతున కనీస మద్దతు ధరకు ఇప్పటికే ఎనిమిది లక్షల టన్నులకుపైగా మొక్కజొన్న కొనుగోలు చేశారని తెలిపారు.  

పత్తి రైతులదీ ఇదే దుస్థితి 
రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 11.27 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, దీనిలో 50 శాతం కర్నూలు జిల్లాలో, 20 శాతం పల్నాడు జిల్లాలో సాగైందని వివరించారు. పత్తి మద్దతు ధర క్వింటా రూ.8,110 కాగా, రైతులకు అతి తక్కువ ధర ఇస్తున్నారని ఆయన తెలిపారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)