Breaking News

వక్ఫ్‌ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు

Published on Tue, 01/20/2026 - 05:26

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): అంజుమన్‌ ఇస్లామియా సంస్థకు చెందిన భూములను ఐటీ కంపెనీలకు కేటాయిస్తూ చంద్రబాబు సర్కార్‌ జారీ చేసిన జీఓను రద్దు చేయాలని ముస్లిం ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. గుంటూరులోని అంజుమన్‌ ఇస్లామియా సంస్థకు చెందిన 72 ఎకరాల భూమిని ఐటీ కంపెనీకి కేటాయించడాన్ని నిరసిస్తూ సోమవారం విజయవాడ ధర్నాచౌక్‌లో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రైతు ఉద్యమనేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం ప్రతినిధులు పాల్గొని మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్‌ అలీ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం దొంగ జీఓలతో వక్ఫ్‌ భూములను కొట్టేయడానికి పన్నాగం పన్నుతోందన్నారు. అంజుమన్‌ ఇస్లామియా భూములను బడా వ్యాపార వేత్తలకు ధారాదత్తం చేస్తోందన్నారు. ముస్లిం సంస్థలకు చెందిన స్థిరాస్తులను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి తగినగుణ పాఠం చెబుతామని హెచ్చరించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ వక్ఫ్‌ భూములు అమ్మకానికి, దానం చేయడానికి ఏ ప్రభుత్వానికీ అధికారం లేదన్నారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ  ప్రభుత్వం వక్ఫ్‌ భూములు అమ్ముకోవడానికి చట్ట సవరణ చేసి కమిటీలో ఇతర కులస్తులకు, కలెక్టర్లకు అవకాశం కల్పించిందన్నారు. మంత్రి లోకేశ్‌ గుంటూరులో ఉన్న 72 ఎకరాల భూమి ఐటీ కోసం అంటున్నాడని, రాజధానిలో అభివృద్ధి కోసం 1640 ఎకరాలు ప్రభుత్వం తీసుకుందని, అందులో కొన్ని ఎకరాల్లో ఐటీ కంపెనీలు పెట్టొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి బాజీ బాబా, ఎనీ్టఆర్‌ జిల్లా అ«ధ్యక్షుడు మస్తాన్, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌ మొహిద్దీన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బడే మియా, ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు సలావుద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ రెహమాన్, రాష్ట్ర అధికార ప్రతినిధులు సయ్యద్‌ ఖలీల్, మైనార్టీలు పాల్గొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)