Breaking News

2019–24 ఐదేళ్ల సమర్థపాలనలోమున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధి

Published on Tue, 11/19/2024 - 04:03

సాక్షి, అమరావతి: సమర్థమైన పాలన వ్యవస్థల ద్వారా గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని  మున్సిపాలిటీలు సర్వతోముఖాభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని ఆర్‌బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆర్థిక స్వయం ప్రతిపత్తి, పౌరసేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని, కార్పొరేషన్ల బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. 2019–2024 వరకు దేశంలోని రాష్ట్రాల్లో 232 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఆరి్థక స్థితిగతులపై ఆర్‌బీఐ అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేసింది. 

2023–24 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల బడ్జెట్‌ మొత్తం వ్యయంలో 50 శాతానికిపైగా ఆస్తుల కల్పన (మూలధన)కు వ్యయం చేసినట్లు నివేదిక పేర్కొంది. అలాగే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మున్సిపల్‌ కార్పొరేషన్ల బడ్జెట్ల మొత్తం వ్యయంలో ఆస్తుల కల్పన వ్యయం 50 శాతం కన్నా ఎక్కువగానే ఉందని నివేదిక వివరించింది. 

కేపిటల్‌ వాల్యూ విధానంలో పన్ను మార్కెట్‌ శాతం అంచనాతో ఆస్తి విలువను ప్రాథమికంగా నిర్ధారించడంతో పాటు ఏటా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తోందని, ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో అమలు చేస్తున్నారని తెలిపింది. అలాగే ఐదేళ్లు రాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్ల మూలధన రాబడులు, వ్యయం కూడా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్లు ఆర్థికంగా స్వయంప్రతిపత్తి సాధించడంతో పట్టణ మౌలిక సదుపాయాలు బాగా పెరిగాయని  తెలిపింది. 

ఆస్తి పన్నుల వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించిన రాష్ట్రాల మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. 2019–20 నుంచి 2023–24 మధ్య రెవెన్యూ వసూళ్లలో ఆస్తి పన్నుల వసూళ్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. రాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌ల్లో మూల ఆదాయాలను, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచుకున్నాయని, దీంతో నీటి సరఫరా సేవలు, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ అధిక నాణ్యతతో నిర్వహిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది.  

Videos

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)