Breaking News

ఏపీలో ఎంఎస్‌ఎంఈ ఉద్యోగాలు భారీగా పెరిగాయి

Published on Sun, 12/31/2023 - 05:03

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ తీసు­కున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్‌­ఎంఈల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోందని కేంద్ర ఎంఎస్‌ఎంఈల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్‌సింగ్‌వర్మ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021–22వ ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఎంఎస్‌ఎంఈల ద్వా­రా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా.. 2022–23లో ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్‌ తెలిపారు.

ఎంఎస్‌ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 7వ స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ పాలనలోని ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5.06 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్‌ఎంఈలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ సంఖ్య 6,99,881కు పెరిగిందని కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్‌ తెలిపారు. దేశంలో 2021–22లో 6,222 ఎంఎస్‌ఎంఈలు మూతపడగా.. ఏపీలో 113 మాత్రమే మూతపడ్డాయని చెప్పారు. 2022–23లో దేశంలో 13,290 ఎంఎస్‌ఎంఈలు మూతపడగా ఏపీలో 261 మాత్ర­మే మూతపడ్డాయని వివరించారు.

కోవిడ్‌ కష్ట సమయంలో సైతం ఎంఎస్‌ఎంఈల కార్యకలాపాలు ని­లి­చిపోకుండా సీఎం జగన్‌ రీస్టార్ట్‌ ప్యాకేజీ, వైఎస్సా­ర్‌ నవోదయం తదితర పథకాలతో చేదోడువాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్‌ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా సీఎం జగన్‌ చెల్లించారు. మరో రూ.­2,087 కోట్ల ప్రోత్సాహకాలనూ విడుదల చేశారు. సీఎం జగన్‌ అందిస్తున్న ప్రోత్సాహంతో భారీగా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. స్థాని­కులకు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. 

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)