Breaking News

వైద్యరంగాన్ని నిర్విర్యం చేస్తున్న చంద్రబాబు

Published on Tue, 11/25/2025 - 04:08

పులివెందుల: వైద్య విద్యార్థులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, వైద్యరంగాన్ని నిర్విర్యం చేస్తోందని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో ఆయన్ని సోమవారం ఆంధ్రప్రదేశ్‌ నీట్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఆ సభ్యుల్లో ఒకరైన పులివెందులకు చెందిన గాజుల జయప్రకాష్‌ ఎంపీతో మాట్లాడుతూ తన కుమారుడు చరణ్‌సాయికి నీట్‌లో 470 మార్కులు వచ్చాయని తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో 471 మార్కుల కటాఫ్‌ కారణంగా ఒక్క మార్కు తేడాతో తన కుమారుడు వైద్యసీటు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారితో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పులివెందుల మెడికల్‌ కళాశాలకు ఎన్‌ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దని లేఖ రాశారని చెప్పారు. పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లను కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కోల్పోయామన్నారు. ఈ రెండు కళాశాలలకు మంజూరైన సీట్లు వచ్చి ఉంటే చరణ్‌సాయి వంటి విద్యార్థులకు మెడికల్‌ సీట్లు లభించేవని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య అందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)