Breaking News

కేవీరావుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయిరెడ్డి

Published on Mon, 01/06/2025 - 19:05

సాక్షి,హైదరాబాద్‌:కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.

కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్ఫర్‌కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు.

సండూరు పవర్‌ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్‌రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. 

  • కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించింది
  • నా స్టేట్మెంట్ ఈడి అధికారులు రికార్డ్ చేశారు
  • డిడి అధికారులు నన్ను 25 ప్రశ్నలు అడిగారు
  • కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసింది
  • కేవీ రావు నాకు తెలియదు అని చెప్పాను
  • అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు
  • కాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఎక్కడ నేను ఫోన్ చెయ్యాలేదు
  • కేవీ రావు ను తిరుమల కు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పాను
  • నేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధం
  • మే నెల 2020 లో నేను ఫోన్ చేసానని కేవి  రావు చెపుతున్నాడు
  • కాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చు
  • నేను ఎక్కడ కూడా కేవీ రావు కు ఫోన్ చెయ్యాలేదు
  • కేవీ రావు ను ఈడీ విచారణ కు పిలవండి  అని కోరాను
  • రంగనాధ్ కంపెనీ నీ ప్రభుత్వం కి ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించింది
  • నాకు సంబంధం లేదు అని చెప్పాను
  • నేను ఒక సాధారణ మైన ఎంపీ నీ మాత్రమే
  • శ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పాను
  • శరత్ చంద్ర రెడ్డి తో ఉన్న సంబంధాలు కూడా అడిగారు
  • కుటుంబ రీలేషన్ అని చెప్పాను
  • కాకినాడ సీ పోర్ట్ విషయం లో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు
  • లుక్ ఔట్ నోటీసుల ఫై నేను ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళాను
  • కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీ కి చెప్పాను
  • విక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారు
  • విక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక  లావాదేవీలు జరుపలేదు
  • సండుర్ పవర్ కంపెనిలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారు
  • కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పాను

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)