Breaking News

‘వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం దిశగా వైఎస్సార్‌సీపీ పరుగులు’

Published on Thu, 06/01/2023 - 10:17

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ప్రకృతి వైపరీత్యాలు, అవాంతరాలు, కష్టా­లు ఎదురైనా మొక్క­వోని ధైర్యంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా­ల­ను నిరాటంకంగా కొనసాగిస్తు­న్నా­రని, జన­రంజక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయ­సాయిరెడ్డి పేర్కొన్నారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి వైఎస్సార్‌సీపీ ముందుకు సాగుతోందని ఆయన బుధ­వా­రం తాడేపల్లిలో విడుదల చేసిన ఒక ప్రకట­న­లో తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికల్లో కేవలం పనితీరుతో ప్రజల మన­సుల్ని గెల్చుకునే మొ­దటి రాజకీయ­పక్షంగా వైఎస్సార్‌సీపీ కొత్త చరిత్రకు శ్రీకా­రం చుట్టబోతోందని తెలిపా­రు.

ఆ ప్రక­టనలో ఆయన ఏమన్నారంటే.. 
సీఎం వైఎస్‌ జగన్‌ రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. రాజ్యసభకు నలుగు­రు బీసీలను పంపించారు. ఇంకా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎమ్మెల్సీ పదవు­లిచ్చారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ పదవులు కూడా ఇచ్చారు. గతంలో పాలకులు పేదలను ఓటర్లుగానే చూశా­రు. అదే సీఎం జగన్‌  పాలనలో సచివా­లయ, వలంటీరు వ్యవస్థలతో ప్రజలకు ఊళ్లోను, ఇళ్లవద్దే పథకాలు అందుతు­న్నాయి.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన  ప్రతి హామీని నిలబెట్టుకుని ప్రజల్లో పూర్తి విశ్వాసం కలిగించిన నేత జగన్‌. తన పాలనతో అందరి కుటుంబాల్లో వెలు­గు­లు నింపుతున్నారు. ఈ నాలుగేళ్లలో డీబీ­టీ ద్వారా రూ.2.11 లక్షల కోట్లు.. పైసా లంచం లేకుండా పారదర్శకంగా లబ్ధి­దా­రుల ఖాతాల్లో జమచేశారు. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వడంతో పాటు దాదాపు 22 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. 

ఇది కూడా చదవండి: కేంద్ర చట్టం పాటించం.. రాష్ట్ర చట్టం వర్తించదు.. రామోజీ తీరు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)