వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం నీ పతనానికే నాంది

Published on Fri, 07/03/2026 - 03:40

జమ్మలమడుగు: రాజకీయ భిక్ష పెట్టిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయించిన కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పతనం ప్రారంభమైందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వైఎస్సార్‌ కడప జల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌ రెడ్డి అనుచరులు ధ్వంసం చేయడం అత్యంత పిరికిపంద చర్య అని, ఇది వైఎస్సార్‌ అభిమానుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని మండిపడ్డారు. ఈ ఘాతుకానికి నిరసనగా గురువారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ప్రదర్శన చేపట్టాయి. అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ నరేష్ బాబుకు వినతిపత్రం సమర్పించారు. 

ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అధికారంలో ఉంటేనే ఎగిరెగిరి పడుతూ ఇక్కడ కనిపిస్తావు. అధికారం లేని ఐదేళ్ల కాలంలో కనీసం 20 రోజులైనా ప్రజల్లో ఉన్నావా? ఓడినా, గెలిచినా రామసుబ్బారెడ్డి ధైర్యంగా ఇక్కడే ఉండి రాజకీయం చేస్తుంటే, నువ్వు మాత్రం బెంగళూరు, గోవా క్లబ్బుల చుట్టూ తిరిగావు‘ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  నీ మేకపోతు గాంభీర్యాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడి విగ్రహాన్ని కూల్చడం అన్నం పెట్టిన చేతిని నరకడమేనని, ఈ దుశ్చర్యతోనే నీ పతనం ప్రారంభమైందని ఆదినారాయణ రెడ్డిని హెచ్చరించారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)