Breaking News

తల్లి, ఇద్దరు కుమార్తెల దారుణ హత్య

Published on Mon, 08/04/2025 - 06:02

సామర్లకోట: వివాహిత, ఇద్దరు బాలికలు దారుణంగా హత్యకు గురైన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం జరిగింది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ కథనం మేరకు.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వెనుక ఉన్న సీతారామ కాలనీలో ములపర్తి ధనుప్రసాద్‌ కుటుంబం నివసిస్తోంది. ధనుప్రసాద్‌ స్థానిక ఏడీబీ రోడ్డు కాంట్రాక్టు పనులకు సంబంధించిన లారీకి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన అతడు సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు.

ఎంత కొట్టినా కుటుంబ సభ్యులు తలుపులు తెరవలేదు. ఏసీ పని చేస్తూనే ఉంది. దీంతో, అతడు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే అతడి భార్య మాధురి (30), కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన (6) చనిపోయి ఉన్నారు. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐలు కృష్ణభగవాన్, శ్రీనివాస్, తదితరులు ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులను రప్పించి, ఆధారాలు సేకరించారు. హతురాలు మాధురి తల నుజ్జునుజ్జయ్యింది. తలపై కొట్టడంతో పలు కోణాల్లో దర్యాప్తు

ఈ హత్యలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ ధనుప్రసాద్‌ ఇంటి వెనుక తలుపు నుంచి గోడ దూకి సమీపంలో ఉన్న కాలనీ వైపు వెళ్లింది. ఈ నేపథ్యంలో హంతకుడు ఇంటి వెనుక తలుపు తీసి పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలి వద్ద ఉండాల్సిన 2 ఉంగరాలు, 2 సెల్‌ ఫోన్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ధనుప్రసాద్‌ రాత్రంతా రోడ్డు పనిలోనే ఉన్నట్లు సూపర్‌వైజర్‌ చెప్పారని సమాచారం. ఈ హత్యలు వివాహేతర సంబంధం కారణంగా జరిగిందా లేక భర్త చేసి ఉంటాడా లేదా దొంగలు చేసిన ప­నా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)