Breaking News

మూడొంతులకు పైగా కులగణన పూర్తి 

Published on Sun, 01/28/2024 - 04:29

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణన ప్రక్రియ నాలుగింట మూడు వంతులకుపైగా పూర్తయింది. కులగణనను ఈ నెల 19 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా డేటా సేకరించింది. దీని ప్రకారం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 1.67 కోట్ల కుటుంబాల్లో 4.89 కోట్ల మంది ఉన్నారు.

ఈ నేపథ్యంలో కులగణన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్‌ యాప్‌ను కూడా సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు వారి పరిధిలో ఇంటింటికీ వెళ్లి గత 8 రోజులుగా ప్రజల సామాజిక, ఆరి్థక స్థితిగతుల వివరాలను నమోదు చేస్తున్నారు.

ఇలా ఇప్పటివరకు 1,33,65,550 కుటుంబాలకు సంబంధించిన 3.39 కోట్ల మంది వివరాలను నమోదు చేశారు. ఇప్పటివరకు మొత్తం 79.59 శాతం కుటుంబాల వివరాల నమోదు పూర్తవగా.. శనివారం 3.60  శాతం కుటుంబాల వివరాలను నమోదు  చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 86.71 శాతం కుటుంబాల వివరాల  నమోదు పూర్తి కాగా, అత్యల్పంగా పల్నాడు జిల్లాలో 71 శాతం పూర్తయినట్టు అధికారులు  వెల్లడించారు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)