Breaking News

ఎక్కువ గ్రామీణ కుటుంబాలు అప్పులకు దూరం

Published on Fri, 07/10/2026 - 02:19

సాక్షి, అమరావతి: దేశంలో ఇప్పటికీ అధికశాతం గ్రామీణ కుటుంబాలకు అప్పుల్లేవు. 2026 నాటికి దేశంలో 54 శాతం కుటుంబాలకు ఎలాంటి రుణాలు లేవు. 46 శాతం కుటుంబాలకు మాత్రమే రుణ బకాయిలున్నాయి. దేశంలో గ్రామీణ రుణమార్కెట్‌ పరిస్థితులపై నాబార్డు సర్వే నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. అయితే 1991 నుంచి క్రమంగా గ్రామీణ ప్రాంతాల్లో అప్పు ఉన్న కుటుంబాల శాతం పెరుగుతూ ఉంది. 

1951లో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అప్పులున్న కుటుంబాలు 63 శాతం ఉండగా 1981 నాటికి అప్పుల కుటుంబాలు 19 శాతానికి తగ్గాయి. 1991కి అప్పులున్న కుటుంబాలు 23 శాతం. 1991 నుంచి అప్పులున్న కుటుంబాలు పెరుగుతూ 2026 నాటికి 46 శాతానికి చేరాయి. 2026 నాటికి దేశంలో గ్రామీణ కుటుంబాల సగటు రుణ పరిమాణం రూ.1,69,800గా ఉందని సర్వే నివేదిక తెలిపింది. 

2021–22 నాటికి దేశంలో గ్రామీణ కుటుంబాల సగటు రుణ పరిమాణం రూ.90,372గా ఉన్నట్లు పేర్కొంది.గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కుటుంబాలు ఉద్దేశపూర్వకంగా రుణం తీసుకోవడం లేదని, ఆ తరువాత అత్యధిక వ్యయం అవుతుందని రుణాలను తీసుకోవడం లేదని తెలిపింది. రుణాలు పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులతోపాటు గతంలో స్నేహితులు, పొరుగువారికి ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో అధికశాతం కుటుంబాలు అప్పులకు దూరంగా ఉంటున్నట్లు నివేదిక వెల్లడించింది.   

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)