Breaking News

రైతన్నలకు మరింత ఆదాయం

Published on Fri, 10/06/2023 - 04:46

సాక్షి, అమరావతి: రాష్ట్రానికే ప్రత్యేకమైన ప్రసిద్ధి చెందిన ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) తేవడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, అదనపు విలువ చేకూర్చడం ద్వారా వారు మరింత ఆదాయం పొందేలా ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ మరో కీలక ముందడుగు వేసింది. ఒకేసారి మూడు సంస్థలతో గురువారం మౌలిక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది.

సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సహకార, వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సమక్షంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ (ఏపీజీబీ), రహేజా సోలార్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌పీఎల్‌), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ఎంవోయూలు చేసుకుంది. ఈ మేరకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో కలిసి సొసైటీ సీఈవో ఎల్‌.శ్రీధర్‌ రెడ్డి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. 

భౌగోళిక గుర్తింపు కోసం సాంకేతిక సహకారం 
రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు (జీఐ) తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇప్పటికే ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్‌ వచ్చింది. ఇదే రీతిలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 32కు పైగా ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ చేస్తున్న కృషికి వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది. తద్వారా రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆయా గొప్ప వంటల వారసత్వాన్ని సంరక్షించడంతోపాటు వాటిని భవిష్యత్‌ తరాలకు అందించేందుకు తగు రీతిలో ప్రచారం చేయడానికి వీలవుతుంది. 

రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు.. 
సోలార్‌ డీ హైడ్రేషన్‌ యూనిట్లకు అవసరమైన సాంకేతికతను ఇప్పటివరకు మహారాష్ట్రకు చెందిన ఎస్‌4ఎస్‌ అనే సంస్థ అందిస్తోంది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే ఉల్లి, టమాటా ఫ్లేక్స్‌ (ముక్కలు)ను కిలో రూ.2.50 చొప్పున కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. అదే రీతిలో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతున్న మిగిలిన యూనిట్లకు సాంకేతిక సహకారం, మద్దతు అందించేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన రహేజా సోలార్‌ ఫుడ్స్‌ ప్రాసె­సింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది.

కనీ­సం 2 వేల యూనిట్లకు సహకారం అందిస్తుంది. ఉల్లి, టమాటాలను సమ­కూర్చడంతో పాటు రైతుల నుంచి ఉల్లి, టమాటా ఫ్లేక్స్‌ను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఏపీజీబీ చైర్మన్‌ రాకేశ్‌ కష్యప్, జీఎం పీఆర్‌ పడ్గెటా్వర్, దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం రిజి్రస్టార్‌ జోగి­నాయుడు, రహేజా సంస్థ వైస్‌ చైర్మన్‌ సౌ­రబ్, ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ స్టేట్‌ లీడ్‌ సుభాష్, మేనేజర్‌ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. 

సోలార్‌ డీహైడ్రేషన్‌ యూనిట్లకు ఆర్థిక చేయూత 
టమాటా, ఉల్లి పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, పొదుపు సంఘాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేకంగా 5 వేల సోలార్‌ డీహైడ్రేషన్‌ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా సొసైటీ ముందుకెళ్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ (ఏపీజీబీ) ముందుకొచ్చింది. సొసైటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన లబి్ధదారులకు రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను బ్యాంక్‌ అందించనుంది. యూనిట్‌ మొత్తంలో 35 శాతా­న్ని సొసైటీ సబ్సిడీ రూపంలో అందిస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ కింద అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది.  

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)