Breaking News

డ్రైనేజీ భూముల్లో టీడీపీ గద్దలు

Published on Sat, 12/21/2024 - 05:51

సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇసుక, బుసక, గ్రావెల్, గ్రానైట్‌తోపాటు పచ్చ నేతల కన్ను ఇప్పుడు ప్రభుత్వ భూములపై పడింది. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని డ్రైనేజీ (ప్రభుత్వ) భూములపై పచ్చనేతతోపాటు ఒక మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, ఇన్నాళ్లూ ఆ భూములను కాపుకాసిన  విశ్రాంత అధికారి కన్నూ పడింది. తలో ఇంత పంచుకున్నారు. ఎటువంటి పట్టాలు పొందే అవకాశం లేని  ఆ ప్రభుత్వ భూములను ఏకంగా అమ్మకానికి పెట్టారు. అగ్రిమెంట్ల మీదనే ఎకరం రూ. 4 నుంచి 5 లక్షలకు అమ్మారు. 

వీటిలో ఎక్కువ భూములను మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దొరకబుచ్చుకున్నారు. ఆ భూముల్లో రొయ్యల చెరువుల సాగుకు సిద్ధమయ్యారు. వేటపాలెం మండలం సంతరావూరు బ్రిడ్జి సమీపంలో ప్రధాన రహదారికి పక్కనే రొంపేరు డ్రైన్, ముసలమ్మ మురుగు నీటి కాలువల మధ్య 50 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. డ్రైన్స్‌ నిర్మాణంలో భాగంగా వాటిని పూర్వం ప్రభుత్వం కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. 

పదేళ్ల క్రితం వరకు వేటపాలెం ప్రాంతంలో ఉన్న కుమ్మరులు (శాలివాహనులు) కుండలు, ఇతరత్రామట్టి పాత్రలు తయారు చేసేందుకు ఆ భూముల్లో ఉన్న బంకమట్టిని తీసుకువెళ్లేవారు. అప్పట్లో ఆ భూముల ఆక్రమణకు కొందరు నేతలు ప్రయత్నించగా కుమ్మరులు అడ్డుకున్నారు. ఆ తర్వాత మట్టి పాత్రలకు డిమాండ్‌ పడిపోయి తయారీ నిలిచి పోవడంతో కుమ్మరులు వాటిని వదిలేశారు. దీంతో ఆ భూములపై అక్రమార్కుల కన్నుపడింది.

వాలిపోయిన పచ్చ మూకలు
ఇప్పుడు వాటిని పరిరక్షించే వాళ్లు లేకపోవడంతో పచ్చ మూకలు వాలిపోయాయి. చీరాల ప్రాంతానికి చెందిన టీడీపీ నేత అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, మరికొందరు ఆ భూములను ఆక్రమించారు. 10 మంది కలిసి 15 ఎకరాల్లో వరి, జొన్న పంటలు సాగు చేసేవారు. ఇంకొందరు కొన్ని భూములు వారివంటూ హద్దులు గీసుకున్నారు.  వేటపాలేనికి చెందిన డ్రైనేజీ విభాగం విశ్రాంత అధికారి సైతం కొంత మేర ఆక్రమించారు. వాస్తవానికి డ్రైనేజీ, డొంక, శ్మశాన తదితర పోరంబోకు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వదు. 

ఇక్కడ కూడా ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని సమాచారం. కానీ టీడీపీ నేతల అనుచరులు ఇప్పటికే సుమారు 18 ఎకరాలు ఆక్రమించడంతో పాటు, అప్పటికే ఆక్రమించిన వారి వద్ద భూములను కూడా ఎకరం రూ. 4 నుంచి 5 లక్షలకు కొన్నారు. ఇలా ఇప్పటివరకూ 30 ఎకరాలకుపైగా డ్రైనేజీ భూములు విక్రయాలు జరిగినట్లు సమాచారం.  డ్రైనేజీ విభాగం రిటైర్డ్‌ అధికారి సైతం కొన్ని భూములను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. వీటన్నింటినీ మాజీ ఎమ్మెల్యే అనుచరుడొకరు కొంటున్నారు. 

ఈ భూముల ఆక్రమణ, అమ్మకాలను అడ్డుకోవాల్సిన డ్రైనేజీ విభాగం అధికారులు కూడా కబ్జాదారులతో కుమ్మక్కైపోయారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారి ఉంటాయని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, డ్రైనేజీ భూములను కొందరు సాగు చేసుకుంటున్న విషయం తన దృష్టిలో ఉందని, ఆక్రమణలు విషయం తన దృష్టికి రాలేదని మురుగునీటిపారుదల శాఖ డీఈ వెంకట సుబ్బారావు చెప్పారు. విచారణ జరిపి క్రయవిక్రయాలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)