Breaking News

ఏడు తరాల ఏడాకుల బీర 

Published on Tue, 07/11/2023 - 04:02

పిఠాపురం: ఇళ్లముందు మామిడి తోరణాలు కనిపించడం సహజం. కానీ.. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో మాత్రం బీరకాయల తోరణాలు కనిపిస్తాయి. ఆ గ్రామంలో లభించే బీర విత్తనాలకు అంతటి ప్రసిద్ధి మరి. మొలకెత్తిన బీరపాదుకు ఏడు ఆకులు రాగానే.. కాయలు కాయడం చిత్రాడ బీర ప్రత్యేకత.

అందుకే.. దీనిని ఏడాకుల బీర అని పిలుస్తుంటారు. పూర్వం ఇక్కడ ఒక ఇంట్లో సాగు చేసిన బీరపాదుకు ఏడాకులు రాగానే కాయలు కాయడం ప్రారంభించడంతో దాని నుంచి విత్తనాలు సేకరించి విత్తనాభివృద్ది చేసినట్టు పెద్దలు చెబుతుంటారు. గ్రామంలో ఏడు తరాలుగా రైతులు ఏడాకుల బీరను సాగు చేస్తున్నారు.   

ఇక్కడి పాదులన్నీ విత్తనాలకే.. 
చిత్రాడలో సాగు చేసే బీర పాదులకు కాసే కాయల్ని ఇంటి అవసరాలకు వినియోగించకుండా కేవలం విత్తనాలకు మాత్రమే కేటాయించడం ప్రత్యేకత. ఇక్కడ పండిన బీర నుంచి తీసిన విత్తనాలు మంచి దిగుబడి వస్తుందనే నమ్మకంతో గుంటూరు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు తదితర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు కూడా చిత్రాడ వచ్చి విత్తానాలను కొనుగోలు చేస్తుంటారు.

ఈ విత్తనంతో వేరే ప్రాంతాల్లో సాగు చేసి.. ఆ పంట నుంచి విత్తనాలను సేకరించినా ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో రైతులు ఈ గ్రామంలో పండిన విత్తనాలపైనే ఆసక్తి చూపుతారు. గ్రామంలో 300 మందికి పైగా రైతులు చిత్రాడ, పరిసర పొలాల్లో బీర పంట సాగు చేస్తున్నారు. బీర పాదుల నుంచి సేకరించిన కాయలను ఇళ్లవద్ద చూరులకు తోరణాలుగా కట్టి నీడలోనే ఆరబెడతారు. పెద్ద రైతులైతే స్థానికంగా ఇళ్లను అద్దెకు తీసుకుని వాటిలో విత్తన బీరను నిల్వ ఉంచుతారు.

పిఠాపురం–కాకినాడ ప్రధాన రహదారికి ఇరువైపులా విత్తన బీరకాయలను వేలాడదీసిన ఇళ్లే కనిపిస్తుంటాయి. ఇతర జిల్లాల నుంచి రైతులకు అక్కడికక్కడే ఎండిన బీరకాయల నుంచి విత్తనాలను తీసి ఇస్తారు. ప్రస్తుతం కేజీ విత్తనాలు రూ.1,600 వరకు ధర పలుకుతుంది.

విత్తన బీరను పండించిన రైతులందరూ తమ ఇళ్లవద్ద మాత్రమే విత్తనాలు విక్రయిస్తుంటారు. సుమారు 600 ఎకరాల్లో రైతులు ఏడాకుల బీరను సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ఎకరాకు 200 కేజీల వరకు విత్తన దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. 

తరతరాలుగా బీర విత్తనాలే 
మా తాతల కాలం నుంచీ బీర తోటలు సాగు చేస్తూ విత్తనాల్ని విక్రయిస్తున్నాం. అధికారులు, శాస్త్రవేత్తలు వచ్చి వీటి ప్రా«ముఖ్యతను గుర్తించారు. ఎన్ని హైబ్రీడ్‌ రకాలు వచ్చినా ఏడాకుల బీర విత్తనాలను కొట్టలేవు. ఎందుకంటే ఈ బీర రుచి, పోషకాలలో ఎంతో గొప్పది. మిగిలిన రకాల బీర కాయలు చేదు వస్తాయి. ఇక్కడ చేదు అనే మాట ఉండదు. చిత్రాడ అంటే ఏడాకుల బీర గ్రామం అనే పేరుంది.  – పేర్నీడి నాగ సత్యవతి, మహిళా రైతు, చిత్రాడ 
 
హైబ్రీడ్‌ రాకతో మానేయాల్సి వచ్చింది 
ఒకప్పుడు సీజన్‌లో 2 టన్నుల వరకు విత్తనాలు విక్రయించేవాళ్లం. వందల ఎకరా­ల్లో బీర సాగు జరిగేది. 90 శాతం మంది రైతులు ఇదే వ్యవసాయం చేసే వారు. పదేళ్లుగా హైబ్రీడ్‌ విత్తనాలు రావడంతో రైతులు వాటిపై మొగ్గు చూపుతున్నారు. దీంతో అమ్మకాలు తగ్గిపోయాయి.

ఒక­ప్పు­డు 90 శాతం మంది రైతులు బీర సాగు చేస్తే.. 10 శాతం మంది మాత్ర­మే బీర వేస్తున్నారు. వీటి విలువ తెలి­సిన రైతులు ఇప్పటికీ ఇక్కడకు వచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎన్ని హైబ్రీడ్‌ విత్తనాలు వచ్చినా చిత్రా­డ ఏడాకుల బీరను మించి ఉండవు.  – పి.కృష్ణ, రైతు, చిత్రాడ 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)