Breaking News

మోక్షితకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదెవరు?

Published on Sat, 05/31/2025 - 04:33

వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో గంగిరెడ్డి మోక్షిత తొలుత పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఫెయిల్‌ అయింది. విచిత్రంగా.. తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లిష్‌లో సోషల్‌లో 84, గణితంలో 93, సైన్స్‌లో 98 మార్కులు వచ్చిన ఈమెకు సోషల్‌ స్టడీస్‌లో మాత్రం 21 మార్కులే వచ్చాయి. పరీక్ష తప్పినట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. 

కానీ, తన ప్రతిభపై గట్టి నమ్మకం ఉన్న మోక్షిత తండ్రి సాయంతో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసింది. ఈసారి 84 మార్కులు వచ్చాయి. అప్పుడు ఎస్‌ఎస్‌సీ బోర్డు మొత్తం 537 మార్కులతో మోక్షిత పదో తరగతి ఉత్తీర్ణులైనట్టు ప్రకటించింది. కానీ, నిజం కాని ఫెయిల్‌కు–నిజమైన పాస్‌కు మధ్యలో ట్రిపుల్‌ ఐటీ, రెసిడెన్షియల్, గురుకులాల్లో ప్రవేశ దరఖాస్తులకు అవకాశం కోల్పోయింది మోక్షిత.

ఈ దోషం ఎవరిది..??
‘‘అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ విద్యార్థినికి పదో తరగతిలో 540 మార్కులు వచ్చాయి. ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 96, ఇంగ్లిష్‌లో 87, గణితంలో 93, సైన్స్‌లో 95, సోషల్‌లో 96 స్కోర్‌ చేసింది. కానీ, హిందీలో 73 మార్కులే వచ్చాయి. దీంతో సందేహం వచ్చి రూ.వెయ్యి చెల్లించి రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. ఒక్క మార్కు కూడా పెరగలేదు. విద్యార్థికి పీడీఎఫ్‌ రూపంలో అందించిన జవాబు పత్రాన్ని చూస్తే.. నాలుగు మార్కుల ప్రశ్నల్లో నాలుగింటికి ‘సున్నా’ వేశారు. 

‘సాక్షి’.. ఈ మూల్యాంకన పత్రాన్ని ఉపాధ్యాయ వృత్తిలో అనుభవజ్ఞులైనవారికి చూపించగా జవాబుల్లో స్వల్ప అక్షర దోషాలు తప్ప మరే సమస్య లేదని, కచ్చితంగా ఒక్కో ప్రశ్నకు మూడు, నాలుగు మార్కులు వస్తాయని చెప్పారు. అంటే, ఆ విద్యార్థిని 12 నుంచి 16 మార్కులు కోల్పోయినట్లేగా?

34 నుంచి ఏకంగా 93కు..
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బాలిక ఆర్‌.సాయికుందనకు పదో తరగతి ఫలితాల్లో 489 మార్కులు వచ్చినా ఫెయిల్‌ అయ్యింది. ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 94, హిందీ 79, గణితం 96, సైన్స్‌ 92, సోషల్‌ 94 మార్కులు రాగా.. ఇంగ్లిష్‌లో మాత్రం 34 వచ్చాయి. ఫీజు కట్టి రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయంగా ఇంగ్గిష్‌లో 34 మార్కులు కాస్తా 93కు పెరిగాయి. అంటే, ఏకంగా 59 మార్కులు వ్యత్యాసం కనిపించింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)