కొనసాగుతున్న ద్రోణి

Published on Sat, 06/15/2024 - 05:11

సాక్షి, విశాఖపట్నం: రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. 

ద్రోణి ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజ­య­నగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతా­రా­మరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు, ఆదివారం పార్వతీ­పురం మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్న­మయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. 

ఊపందుకోనున్న రుతుపవనాలు..
కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తు­న్నాయి. అయితే రెండు మూడు రోజుల్లో రుతుప­వనాలు చురుకుదనం సంతరించు కోనున్నాయి. ఫలితంగా ఈనెల 17, 18 తేదీల్లో కోస్తాంధ్రలోను, 18న రాయలసీమలోను భారీ వర్షాలు కురుస్తా­యని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. 

శుక్రవారం రాత్రి వరకు డోలపేట (విజ­య­నగరం జిల్లా)లో 7.8 సెంటీమీటర్లు, కోట ఉరట్ల (అనకాపల్లి)లో 5.7, అనపర్తి (తూర్పు గోదా­వరి)­లో 4.3, ఎచ్చెర్ల (శ్రీకాకుళం)లో 3.2, సాలూరు (పార్వతీపురం మన్యం)లో 2.9, పర్లపాడు (వైఎస్సార్‌)లో 2.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)