Breaking News

సభలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తీరు సిగ్గు చేటు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

Published on Wed, 11/13/2024 - 14:30

సాక్షి,అమరావతి : ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శాసన మండలి చర్చలో ‘డయేరియాపై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు సంభవించాయి’అని చిరునవ్వుతో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.

శాసన మండలి సమావేశాల సందర్భంగా డయేరియా మరణాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. 

‘‘సభలో డయేరియాపై ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం బాధాకరం. మృతులపై ఎంతటి అభిమానం ఉందో మంత్రి నిర్లక్ష్య సమాధానమే చెబుతోంది.మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. గత 30 ఏళ్లలో గుర్లలో ఎన్నడూ డయేరియా మరణాలు సంభవించలేదు. సెప్టెంబర్ 20న మొదటి కేసు నమోదైంది. అక్టోబర్ 12వ తేదీ నాటికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 19న వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేసే వరకు ప్రభుత్వంలో చలనం రాలేదు.

చదవండి: డయేరియా మరణాలపై నవ్వుతూ హేళనగా మాట్లాడిన ఏపీ మంత్రి 

20 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వాసుపత్రి ఉంది. పక్క జిల్లాలో కేజీహెచ్ ఉంది. కానీ స్కూల్‌ బల్లలపై వైద్యం అందించారు. స్కూల్ బల్లలపై డయేరియా బాధితులకు వైద్యం అందించినందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. మృతుల సంఖ్యను తగ్గించడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. డయేరియా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. ఒక్కో డయేరియా బాధిత కుటుంబానికి  వైఎస్‌ జగన్‌ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  

ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వైఎస్‌ జగన్‌  వెళ్లే వరకూ జిల్లా ఇంఛార్జి మంత్రి వంగలపూడి అనిత..ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ కూడా వెళ్లలేదు. మృతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కూటమి ప్రభుత్వంపై YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)