Breaking News

దాడి చేసింది టీడీపీ రౌడీలే

Published on Mon, 10/30/2023 - 04:57

సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్‌పై కావలిలో దాడి చేసిన రౌడీలు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దాడి చేసిన రౌడీలు ‘ఐ సపోర్ట్‌ బాబు..’ బ్యానర్లు పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పారు.

ఆధారాలతో సహా రౌడీ మూకల ఫో­టోలను మీడియాకు ఆయన విడుదల చేశారు. ప్రశాంత ప్రాంతం కావలిలో ఎవరు ఎటువంటి వారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం తాడే­పల్లి­­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల­యంలో విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు తెలుసు­కో­కుండా లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ బుర్రలేని మా­ట­లు మాట్లాడారని విమర్శించారు.

దొంగలే.. దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సాయంత్రం 6.30 గంటల సమ­యంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలసి తాను ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్తుం­డగా సంఘటన స్థలం వద్ద ఏం జరిగిందో వివరాలు సేకరించాలని పోలీసులకు సూ­చించినట్లు చెప్పారు. టీడీపీ, దాని తోక పార్టీలు ప్రతి విషయాన్ని వైఎస్సార్‌ సీపీకి ఆపాదించే యత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసని చెప్పారు.

నిందితుడు సుధీర్‌పై నాలుగు రాష్ట్రాల్లో వందల కేసులున్నాయని, అవన్నీ బయటకు తీస్తామని తెలిపారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారు ఒక్క­రున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరి లోకేశ్‌ అందుకు సిద్ధమేనా? అని సవాల్‌ చేశారు. ప్రధాన ముద్దాయి సుధీర్‌ గతంలో తన కారుపై కూడా దాడి చేసిన­ట్లు పేర్కొన్నారు. టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్న పసుపులేటి సుధాకర్‌ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్‌ కుమార్‌ ఉన్నట్లు వెల్లడించారు.

గతంలో జనసేన తరఫున తనపై పోటీ చేసిన సుధాకర్‌ వద్ద ఇలాంటి గ్యాంగులు చాలా ఉ­న్నాయని, వాటిని హైదరాబాద్‌లో మోహరించి ఏం చేస్తున్నాడో తమకు సమాచారం ఉందన్నారు. అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి ‘ఐ సపోర్ట్‌ బాబు’ అనే బ్యానర్‌ పట్టుకున్నాడని చెప్పారు. శివారెడ్డి జనసేన కార్యకర్తే అనే విషయాన్ని పవన్‌ తెలుసుకుంటే మంచిదన్నారు. ఎవరు రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)