Breaking News

ఎమ్మెల్యే నల్లమిల్లి కక్ష సాధిస్తున్నాడు

Published on Sun, 01/04/2026 - 04:19

రాజమహేంద్రవరం రూరల్‌: అంధురాలైన తన భార్య పింఛన్‌ నిలిపివేశారని జనసేన పార్టీ నేత వీరబాబు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు తన భార్యకు పింఛన్‌ ఇవ్వడం లేదని బిక్కవోలు మండలం ఆరికిరేవుల గ్రామ పంచాయతీకి చెందిన జనసేన వార్డు మెంబర్‌ వీరబాబు తెలిపాడు. శనివారం ఆయన అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి, వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల సెల్‌ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్, అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవల్లి భరత్‌ కుమార్‌ తదితరులతో కలిసి డీఆర్‌డీఏ పీడీ ఎంవీఎస్‌ఎన్‌ మూర్తికి ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కక్ష పెంచుకున్నారని తెలిపాడు. తన భార్య కొర్ల రాముకు వస్తున్న దివ్యాంగ పింఛన్‌ను గత నెలలో నిలిపివేశారని ఆరోపించారు. సదరం వెరిఫికేషన్‌ చేయించుకోవాలని అధికారులు మెమో ఇస్తే.. ఆ మేరకు ఆన్‌లైన్‌లో వైద్యులు పరీక్షించి, 40 శాతం వైకల్యం ఉన్నట్లు నివేదిక ఇచ్చారన్నారు. అయితే గత నెల 31న పింఛను వచ్చినట్లు తన భార్య సెల్‌కు మెసేజ్‌ వచ్చిందన్నారు. కానీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగి నగదు ఇవ్వకుండా ఎంపీడీఓ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. ఆఫ్‌లైన్‌లో మరోసారి రీవెరిఫికేషన్‌ చేయించాలని, అప్పుడు కూడా 40 శాతం వస్తే పింఛను ఇస్తామని పీడీ చెప్పారని వీరబాబు తెలిపారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)