Breaking News

బూటకపు మాటలొద్దు.. రంకెలేసిన ఎద్దు

Published on Thu, 08/14/2025 - 05:40

ఆలమూరు: మూగజీవాలకూ తెలిసిపోయింది కూటమి హామీ­లు బూటకమని. టీడీపీ నేతల నాటకాలను జనం భరించినా మేం చూసి ఊరుకోలేమన్నట్లు రంకెలు వేశాయి. రైతు సంబరాల పేరిట టీడీపీ నిర్వహించిన కార్యక్రమం ఈ ఉదంతానికి వేదికగా నిలిచింది. టీడీపీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎడ్ల బండిపై నుంచి మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్, అన్నదాత సుఖీభవ అనగానే ఆ బండి ఎద్దులు ఒక్కసారిగా రంకెలు వేశాయి. కాడిని బలంగా గుంజుకున్నాయి. దీంతో బండిపై నుంచి కింద పడ్డ ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైతు సంబరాల కార్యక్రమంలో భాగంగా బుధవారం  చొప్పెల్ల నుంచి ఆలమూరు వ్యవసాయ మార్కె­ట్‌ కమిటీ కార్యాలయం వరకు టీడీపీ శ్రేణులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల­తో ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ నర్శిపూడి, నవాబు­పేట, పెనికేరు, కలచవర్ల మీదుగా ఆలమూరుకు చేరుకుని సభకు వెళుతున్న తరుణంలో టీడీపీ నేతలు ‘సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌.. అన్నదాత.. సుఖీభవ..’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎక్కిన బండి లాగుతున్న ఎద్దులు ఒక్కసారిగా రంకెలేశాయి. 

వెనక్కు తిరిగి పక్కనున్న వారిని ఎగిరి కాళ్లతో తంతూ పరుగు­తీశాయి. దీంతో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రామకృష్ణ, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలు­వూరి సతీష్‌రాజు కింద పడిపోయారు. వారిని కార్యకర్తలు పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. తీవ్రంగా గాయపడ్డ సతీష్‌రా­జును రావులపాలెం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఏం మేలు జరిగిందని ‘అన్నదాత.. సుఖీభవ’ అంటూ నినాదాలు చేశారని.. రైతులకు ఏం మేలు జరగలేదని మూగజీ­వాలకు కూడా తెలిసిపోయిందని పలువురు గుసగుసలు పోయారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)