Breaking News

దారిమళ్లిన పోలవరం నిధులు

Published on Thu, 07/31/2025 - 05:02

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిన వైనం రాజ్యసభ సాక్షిగా బట్టబయలైంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండో విడత అడ్వాన్సు కింద మార్చి 11న విడుదల చేసిన రూ.2,704.71 కోట్లలో ఇప్పటి వరకు కేవలం రూ.569.36 కోట్లనే ఎస్‌ఎన్‌ఏ (సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ) ఖాతాలో జమ చేసిందని, మిగతా నిధులు అంటే రూ.2,135.35 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయని ఈ నెల 28న రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌ శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి స్పష్టం చేస్తూ సమాధానమిచ్చారు. 

అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేసి, వాటిని పోలవరం పనులకు మాత్రమే వినియోగించాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆదేశించింది. అయితే రూ.2,135.35 కోట్లను నాలుగున్నర నెలలుగా జమ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. దీన్ని బట్టి ఆ నిధులను ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించినట్లు స్పష్టమవుతోందని అధి­కార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అడ్వాన్సు నిధులను ఇతర అవసరాలకు మళ్లించకపోతే ఇప్పటికీ ఎస్‌ఎ­న్‌ఏ ఖాతాలో వాటిని ఎందుకు జమ చేయలేదని ప్రశ్నిస్తున్నాయి. 

గతంలో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్‌ చేసేది. కేంద్రం రీయింబర్స్‌ చేసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులే. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటే పోల­వరం నిధులను మళ్లించేశారంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దు్రష్ఫచారం చేసేవాళ్లని.. ఇప్పుడు అడ్వాన్సుగా ఇచి్చన నిధులను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేయకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)