Breaking News

ఇంటింటా చేదు అనుభవం

Published on Thu, 07/03/2025 - 03:10

కర్నూలు(హాస్పిటల్‌): ‘ఇంటింటికీ సుపరిపాలన’ పేరుతో కర్నూలు ప్రజల వద్దకు వెళ్లిన మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజుకు ఇంటింటా చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ పథ­కాలు అందడం లేదంటూ ప్రజలు నిలదీశారు. పింఛన్‌ ఇవ్వట్లేదని, గ్యాస్‌ సబ్సిడీ అందడం లేదని, తల్లికి వందనం డబ్బులు పడలేదంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు బుధవారం ఉదయం నగరంలోని బుధవారపేటలో పర్యటించారు. ప్రజ­ల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. వారు తిరిగిన ఇళ్లల్లో అత్యధిక శాతం మంది తమకు సంక్షేమ పథకాలేవీ అందడం లేదని జవాబులివ్వడంతో.. టీడీపీ నేతలు కంగుతిన్నారు.

పింఛన్‌ ఎందుకివ్వట్లేదు?
పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకొని ఏడాదైనా ఇప్ప­టికీ మంజూరు చేయలేదని సుంకులమ్మ అనే వృద్ధురాలు ప్రశ్నించింది. తనకు పదేళ్ల క్రితం ప్రమా­దంలో కాళ్లు పోయాయని.. అయినా వికలాంగుల పింఛన్‌ ఎందుకు ఇవ్వట్లేదని సందెపోగు రఘు అనే వృద్ధుడు నిలదీశాడు. కనీసం వృద్ధాప్య పింఛన్‌ కూడా ఇవ్వట్లేదని మండిపడ్డాడు. పదో తరగతి చదువు­తున్న తనకు తల్లి­కి వంద­నం డబ్బు­లు పడలేదని మేరి కుమారి అనే విద్యార్థిని వాపోయింది. 

తమకు ఉచిత గ్యాస్‌ పథకం ఎందుకు వర్తింపజేయలేదంటూ విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి టీడీపీ నేతలను నిలదీశారు. తాను బీటెక్‌ పూర్తి చేశానని.. ఉద్యోగం ఇప్పించాలని మంత్రిని దీపిక అనే యువతి కోరారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాగానే ఉద్యోగం ఇప్పిస్తానంటూ మంత్రి భరత్‌ జవాబివ్వడంతో ఆమె షాక్‌కు గురైంది. మంత్రి మీడియాతో మాట్లాడుతూ..ఎవరో ఒకరిద్దరు పథకాలు అందలేదని చెబితే ‘సాక్షి’లో అవే చూపిస్తారంటూ అక్కసు వెళ్లగక్కారు.

వితంతు పింఛన్లు ఎప్పుడిస్తారు?
జి.సిగడాం: ‘ఎంపీ బాబూ.. మా ఇంటి పెద్ద దిక్కు మరణించి ఏడాది కాలమైనా ఇంత వరకు వితంతువుల పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదు. మేమంతా అనాథలుగా ఉన్నాం. వీటితోపాటు తల్లికి వందనం కింద రూ.15 వేలు అన్నారు. రూ.13 వేలు మాత్రమే మా ఖాతాలో జమ చేశారు. ఇదేనా సుపరిపాలన?’ అంటూ వితంతువులు విజయ­నగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం, ఆనందపు­రం గ్రామాల్లో నిలదీశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)