Breaking News

చెప్పలేని మాటల్లో దుర్భాషలాడుతూ.. మంత్రి ఫరూక్‌ పీఏ వీరంగం

Published on Wed, 08/21/2024 - 07:59

నంద్యాల, సాక్షి: ‘‘లం..కొడకల్లారా..మీకు కళ్లు కనపడవా..ఒక్కొక్కడికి ఉందిరా.. ఎవరి ఆస్తో తెలియకుండానే ట్యాక్స్‌ వేస్త్రారా’’ అంటూ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పీఏ అనిల్‌ నంద్యాల మునిసిపల్‌ అధికారులపై రెచ్చిపోయారు. నంద్యాలలోని మునిసిపల్‌ కార్యాలయానికి మంత్రి పీఏ అనిల్‌ కొంతమంది అనుచరులతో మంగళవారం వచ్చారు. వెంటనే రెవెన్యూ ఆఫీసర్‌ వెంకట కృష్ణ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ గులాం హుస్సేన్‌లను మునిసిపల్‌ చాంబర్‌కు పిలిపించారు. 

వారు చాంబర్‌లోకి అడుగుపెట్టగానే తాళం వేసి ఇష్టమొచ్చినట్లు తిట్టారు. గట్టిగా అరుస్తూ మీ అంతు తేలుస్తా.. ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తా అంటూ బూతుపురాణం అందుకున్నారు. కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి ఎదుటే సిబ్బందిని తిడుతున్నా ఆయన కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. నంద్యాలలోని పద్మావతినగర్‌లో మంత్రి ఫరూక్‌కు చెందిన స్థలం ఉంది. దీనికి సంబంధించి వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ను మునిసిపల్‌ సిబ్బంది వేరొకరి పేరు మీద వేశారు. విషయం తెలుసుకున్న పీఏ అనిల్‌ రెచ్చిపోయారు. మునిసినల్‌ చాంబర్‌కు తాళాలు వేసి అధికారులను చెడామడా తిట్టారు. గంట సేపు అటువైపు ఎవ్వరినీ రానివ్వలేదు.    

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం  
మంత్రి పీఏ అనిల్‌ చేసిన రభసపై మునిసిపల్‌ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా..‘అదేదో ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ. నాకు పూర్తిగా తెలియదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)