Breaking News

చిట్టి చిలకమ్మా.. ఎక్కడికెళ్లింది..

Published on Mon, 12/29/2025 - 15:13

ప్రజల సొమ్ము మంచినీళ్లలా ఖర్చు చేయడంలో చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే పయనం.. వాటికి లక్షలు.. కోట్లలో అద్దెలు చెల్లిస్తూ షికార్లు చేస్తున్నారు. బయటకు చెప్పేది మాత్రం పెట్టుబడుల సాధన.. పారిశ్రామిక వేత్తలతో చర్చలు. రాష్ట్రానికి పరిశ్రమలు. వ్యాపారాలు తీసుకురావడం.. కానీ లోపల ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. కానీ ఈ ఏడాదిన్నరలోనే పదుల సంఖ్యలో ఢిల్లీ.. హైద్రాబాదు వంటి చోట్లకు షికార్లకు వెళ్లారు. 

అంతేకాకుండా  తండ్రి చంద్రబాబుతో కలిసి సింగపూర్..  అమెరికా.. ఇలా ఎన్నిసార్లు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు.. అట్నుంచి వచ్చి రాష్ట్రానికి ఏం లాభం చేసారో చెప్పలేరు.. కానీ అయన ఎక్కినా విమానాలు మాత్రం రయ్యి రయ్యిన ఆకాశంలో ఎగురుతూనే ఉంటాయి.  నవంబర్లో తండ్రితో కలిసి సింగపూర్ వెళ్లొచ్చారు.. ఆ తరువాత కొద్దీ రోజులకే డిసెంబర్ మొదటి వారంలో డల్లాస్ వెళ్లిన లోకేష్ అక్కడ తెలుగువారితో భేటీ అయ్యారు.

దీనికోసం ఐటీడీపీ .. ఎల్లోమీడియా ఇచ్చిన ఎలివేషన్లు అంతా ఇంతా కాదు.. లోకేష్  విదేశాలకు వెళ్లడం.. అక్కడి ఐటి ప్రముఖులతో ఫోటోలు దిగడం.. అంతే.. ఇక ఆ కంపెనీ ఆంధ్రా వచ్చేసినట్లు చెప్పడం.. ఆ మధ్య గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ను కలిసిన ఫోటోలు మీడియాకు విడుదల చేయడం లేటు.. వెంటనే ఇక గూగుల్ తో ఏపీకి చుట్టరికం కలిపేయడం.  రాష్ట్రంలోని యువతకు ఐటీ జాబులు వచ్చినట్లు ప్రచారం చేయడం రొటీన్ అయింది.

తాజాగా నేడు  ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న తరుణంలో లోకేష్ మళ్ళీ ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు వెళ్తున్నారు. అసలు ఈ పర్యటన గురించి ప్రభుత్వంలో ఎక్కడా ప్రకటన కానీ సమాచారం కానీ లేదు.ఈ నేపథ్యంలో ఆయన లండన్ ఎందుకు వెళ్తున్నారు.. అది వ్యక్తిగతమా ? ప్రభుత్వ పరంగా  వెళ్తున్నారా అన్నది ఎక్కడ లీక్ చేయడం లేదు. డిసెంబర్ 29న కేబినెట్ భేటీ ఉన్నప్పటికీ అయన ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు ఎందుకు వెళ్ళారన్నది సందేహాస్పదంగా అనిపిస్తోంది. ఆయన రహస్యంగా ఎవరినైనా కలుస్తున్నారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)