Breaking News

3లక్షల పింఛన్లు కట్‌!

Published on Fri, 11/15/2024 - 05:37

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం మరో షాక్‌ ఇవ్వనుంది. అనర్హత పేరుతో మూడు లక్షల మంది పింఛన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు  ఈ విషయాన్ని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో నాలుగో రోజు గురువారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు వివరణ ఇచ్చారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని సభ్యులు ప్రశ్నించారు.

 3 లక్షల మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని, 2.5 లక్షలు కొత్త పింఛన్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి బదులిచ్చారు. దివ్యాంగులు కానివారు కొంతమంది డాక్టర్ల ద్వారా నకిలీ సరి్టఫికేట్‌ పొంది పింఛన్లు తీసుకుంటున్నారని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చెప్పారు. రాష్ట్రంలో 8 లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉన్నాయని, వాటన్నింటినీ తనిఖీ చేసి అనర్హులను తొలగిస్తామని మంత్రి వివరించారు. 

ఎస్సీ, ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో మంత్రి చెప్పాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రశ్నించారు. కానీ ఈ ప్రశ్నకు మంత్రి కొండపల్లి స్పందించలేదు. విశాఖలో భూ కుంభకోణాలపై విచారణకు సిట్టింగ్‌ జడ్జితో కమిటీ లేదా హౌస్‌ కమిటీ వేయాలని సంబంధిత మంత్రికి స్పీకర్‌ సూచించారు.

విశాఖలోని రుషికొండలో నిరి్మంచిన భవనాల నిర్మాణ ఖర్చులు రూ.409.39 కోట్ల వివరాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ సభలో వివరించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు రఘురామకృష్ణరాజు స్పందిస్తూ రుషికొండలో భవనాలు కూల్చేయాలన్న పిటిషన్‌ను వెనక్కితీసుకుంటామని చెప్పారు.  

సీట్లు కేటాయించండి అధ్యక్షా! 
పారీ్టలు మారినట్లు అసెంబ్లీలో సీట్లు మారుతుంటే కష్టంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సభలో ఆవేదన వ్యక్తంచేశారు. సభ్యులకు ఎవరి సీట్లు వారికి కేటాయిస్తే బాగుంటుందని ఆయన స్పీకర్‌ను కోరారు. అంతా మన హౌసే కదా... అని స్పీకర్‌ చెప్పగా... అయినా కూడా ఎవరి సీట్లు వాళ్లకు ఇవ్వాలని బుచ్చయ్య స్పష్టంచేశారు.  

డిసెంబర్‌లో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ 
రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్‌ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌  స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్‌లో ఆయన సెర్ప్, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో సమీక్ష జరిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)