Breaking News

మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై కేసులో బాధితురాలే అరెస్ట్‌

Published on Tue, 12/23/2025 - 15:25

సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై కేసులో పోలీసులు స్వామి భక్తి ప్రదర్శించారు. ఈ కేసులో బాధితురాలినే పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రి డైరెక్షన్‌లో విచారణ  చేసిన పీఏను కాపాడేందుకు యత్నిస్తున్న పోలీసులు.. కేసు పెట్టిన బాధితురాలినే అరెస్ట్‌ చేశారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో నిందితులను కాపాడిన పోలీసులు.. వాట్సాప్‌ చాటింగ్‌ సైబర్‌ క్రైమ్‌ అంటూ కేసు పక్కదారి పట్టించారు.

మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్‌ పై లైంగికదాడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. టీచర్‌గా పనిచేస్తున్న భర్త కరోనాతో చనిపోయిన తన నుంచి కారుణ్య నియామకం కోసం డబ్బులు వసూలు చేయడంతోపాటు మానసికంగా, శారీరకంగా వేధించాడని,  లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించాడని బాధితురాలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే, లైంగికదాడి కేసులో నిందితుడు  సతీష్‌ను ఇప్పటివరకు టచ్ చేయని పోలీసులు.. బాధితురాలినే అరెస్ట్‌ చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌ దురాగతాలపై బాధితురాలి కథనం ప్రసారం చేసినందుకు సాక్షి మీడియాకు సాలూరు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ ఫిర్యాదుతో సాక్షి మీడియాకు పోలీసులు ఫిర్యాదులు ఇచ్చినట్టు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపకుండా తాత్సారం చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం ఆగమేఘాల మీద కేసులు నమోదు చేస్తుండటం​ గమనార్హం.‍ కాగా, బాధితురాలిని 24 గంటలపాటు పోలీసులు అదుపులోనే ఉంచుకున్న కథనాన్ని సాక్షి ప్రసారం చేసింది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)