Breaking News

వేమన సతీష్‌ మాటేమిటో?

Published on Sun, 11/30/2025 - 14:03

సాక్షి ప్రతినిధి, కడప: చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల అమల్లో తన..మన అంటూ ‘పచ్చ’పాతం చూపించే బాబు సర్కారు.. పార్టీ నేతలపైనా అదే పంథాను అనుసరిస్తోంది. మంచీ.. చెడు..న్యాయం.. ధర్మం కాకుండా ‘లెక్క’ల బేరీజులు వేసుకుంటూ మరీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఓ మహిళ ఆరోపణలపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్‌ వ్యవహారంలో సీఎంఓ ఆగమేఘాలపై స్పందించింది. కానీ, తమ పార్టీకే చెందిన దళిత మహిళా నేత సుధా మాధవి చేసిన ఆరోపణలపై స్పందనే లేకుండా పోయింది.పైగా సదరు మహిళా నాయకురాలిపైనే పోలీసులు వే ధింపులు తీవ్రమయ్యాయి. లాభ నష్టాల బేరీజు వేసుకున్న తర్వాతే టీడీపీ అధిష్టానం స్పందన ఉన్నట్లు ఈ ఘటన ఉదంతం స్పష్టం చేస్తోంది.

తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎన్‌ఆర్‌ఐ వేమన సతీష్‌ తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తామ ని నమ్మించి రూ.7కోట్లు తీసుకున్నారని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు సుధా మాధవి ఇటీవల ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో హైకోర్టు న్యాయవాది జడ శ్రమణ్‌కుమార్‌ అండతో మీడియా ముందుకు వచ్చి ఆవేదన వెళ్లబోసుకున్నారు. సుధా మాధవి కన్నీళ్లు టీడీపీ పెద్దల్ని కరిగించలేకపోయాయి. పైగా ఆమైపెనే ఒత్తిళ్లు వచ్చాయి. ‘వేమన సతీష్‌పై ఆరోపణలు చేస్తావా...’ అంటూ పోలీసు అధికారుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.

లాభ నష్టాలు బేరీజు వేసుకుని స్పందన...  
గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీఏ సతీష్‌ తనకు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారని, వేధింపులకు గురి చేశారని తాజాగా ఓ మహిళ ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన సీఎంఓ మంత్రి పీఏపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆదేశించింది. మరి.. అంతకు మించి ఆరోపణలు వచ్చిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నాయకుడు వేమన సతీష్‌పై ఎందుకు చర్యలు చేపట్టలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అదే పార్టీకి చెందిన దళిత మహిళా నేత సుధా మాధవి ఆరోపణలపై సీఎంఓ నుంచి కనీస స్పందన కరువైంది. పైగా సుధా మాధవి సాక్ష్యాధారాలుగా ఉన్న వీడియోలు కూడా విడుదల చేశారు. అయినా పార్టీ నుంచి.. సీఎంఓ నుంచి ఆమెకు కనీస మద్దతు లభించలేదు. పైగా పోలీసుల నుంచి వేధింపులకు గురయ్యారు. ఈ ఉదంతాన్ని గమనిస్తే లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే టీడీపీ అధిష్టానం చర్యలున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ‘మనోడైతే ఓ న్యాయం, పేదోడైతే మరో న్యాయం’ అన్నట్లుగా చర్యలున్నాయని వారు వివరిస్తున్నారు. వేమన సతీష్‌కు టీడీపీ పెద్దల మద్దతు ఉండడంతోనే పోలీసు వ్యవస్థ సైతం అండగా నిలుస్తూ దళిత మహిళా నాయకురాలిపై నిరంకుశితంగా వ్యవహరించారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)