Breaking News

రైలు ప్రమాద బాధితులకు చెక్కులు అందించిన మంత్రి బొత్స

Published on Wed, 11/01/2023 - 14:47

సాక్షి, విజ‌య‌న‌గ‌రం: కంట‌కాప‌ల్లి రైలు ప్ర‌మాద బాధితులను మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. వారికి నష్ట పరిహారం చెక్కులను మంత్రి అందజేశారు. ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వారి వ‌ద్ద‌కు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కుదుట పడే వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని సూచించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మృతి చెందిన 13 మందికి, 30 మంది గాయ‌ప‌డిన వారికి క‌ల‌సి మొత్తం 43 మందికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.2.59 కోట్లు ప‌రిహారంగా అంద‌జేస్తోందని మంత్రి బొత్స తెలిపారు.  మంగ‌ళ‌వారం 8 మందికి ప‌రిహారం అందించామని, ఈ రోజు 12 మందికి ప‌రిహారం అంద‌జేశామని, రేప‌టిలోగా అంద‌రికీ ప‌రిహారం అందిస్తామని మంత్రి వెల్లడించారు.

గాయాలపాలైన వారు జీవితాంతం బాధ‌ప‌డ‌కుండా వారికి తోడ్పాటు అందించేందుకు ముఖ్య‌మంత్రి.. శాశ్వ‌త అంగ‌వైక‌ల్యం పాలైన వారికి రూ.10 ల‌క్ష‌ల స‌హాయం ప్ర‌క‌టించారు. నెల రోజుల‌కు మించి ఆసుప‌త్రిలో చికిత్స అవ‌స‌రమయిన వారికి రూ.5 ల‌క్ష‌లు, నెల రోజుల్లోపు చికిత్స పూర్త‌యి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన వారికి రూ.2 ల‌క్ష‌లు స‌హాయం అందిస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.
చదవండి: వేమూరి రాధాకృష్ణకు లక్ష్మీ పార్వతి చురకలు

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)