Breaking News

ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌

Published on Fri, 04/21/2023 - 13:29

సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై  విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీల పై సమీక్షించాం. త్వరలో బదిలీల పై నిర్ణయం తీసుకుంటాం. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం. ఇందు కోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.

‘‘విశాఖపట్నం పరిపాలన రాజధాని మా పాలసీ. అమరావతి రాజధాని అయితే, చంద్రబాబు కాపురం హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారు. కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటి?’’ అని మంత్రి ప్రశ్నించారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారు. నేను ముందే చెప్పాను. ఈ రోజు బిడ్డింగ్‌తో ఆ విషయం స్పష్టమయింది. మేము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం.’’ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. విద్యార్థులకు రాగి జావ నిలిపేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పరీక్షలు, ఒంటిపూట బడుల వల్లే చిక్కీలు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
చదవండి: చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)