Breaking News

పోలవరం పనులను పరిశీలించిన మంత్రి అంబటి

Published on Wed, 10/25/2023 - 10:37

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పోలవరంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాం వద్ద జరుగుతున్న డి వాటరింగ్‌ పనులను ఆయన పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్‌ నీటి మళ్లింపు పనులను స్వయంగా ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని పరిశీలించామని.. లోయర్‌, అప్పర్‌ కాఫర్‌ డ్యాంల మధ్య ఏరియాలో డీ వాటర్ వర్క్స్ జరుగుతున్నాయన్నారు. డీ వాటర్‌ వర్క్‌ అనంతరం వైబ్రో కాంపాక్ట్‌ పనులు మొదలవుతాయన్నారు. లోయర్‌ అప్పర్‌ కాఫర్‌ డ్యాంల మధ్య.. సీఫేస్‌ ఎక్కువ ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది, దానికి సమాంతరంగా కొత్తది కట్టే అంశంలో కేంద్ర జలశక్తి శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి అంబటి తెలిపారు.

‘‘నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. 41.15 కాంటూరు వరకు టీడీపీ హయాంలో వేసిన అంచనాకు నేటికి ఖర్చు పెరిగింది. 41.15 వరకు రూ.31,625 కోట్లతో సీడబ్ల్యూసీ రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీకి బిల్లు పంపాం. 45.72 కాంటూరు వరకు మరో రూ.16 వేలు కోట్లు ఖర్చు పెట్టాలి. 41.15 వరకు పూర్తియ్యాక మిగిలిన వాటి గురించి చర్యలు తీసుకుంటాం. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్‌ కలిశారు’’ అని మంత్రి తెలిపారు.
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)