తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?
భారీ వర్షం.. పిడుగులు.. వాతావరణ శాఖ హెచ్చరిక
Published on Mon, 06/15/2026 - 16:21
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు (సోమవారం) పలు జిల్లాల్లో మరికాసేపట్లో పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ నేపథ్యంలో పలు జిల్లాలలకు హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఎల్లో అలర్డ్ , అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతా గాలులు వీచే అవకాశం ఉందని పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెట్లకింద, పలు హోర్డింగుల దగ్గర నిల్చోకూడదని తెలిపింది.

#
Tags : 1