Breaking News

మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీరావు బెంబేలు 

Published on Wed, 03/29/2023 - 05:11

సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమాల డొంక కదిలి ప్రధాన ముద్దాయిగా నిరూపణ అయ్యే పరిస్థితి రావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నాడని, అందుకే ‘దళితులపై దమనకాండ’ అంటూ ‘ఈనాడు’లో అడ్డగోలు రాతలు రాస్తున్నాడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున నిప్పులు చెరిగారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘దొంగ బాబు­కు మద్దతుగా గజదొంగ రామోజీ తన రాతలతో వెర్రి కూతలు కూస్తున్నాడు. ముసుగు దొంగలైన వీరిద్దరికీ ఇబ్బంది వస్తే దళితులు గుర్తొస్తారు.

గతంలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ను పక్కదారి పట్టించేందుకు అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటును చంద్రబాబు తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు మార్గదర్శి కేసును మళ్లించేందుకు దళితులపై దమనకాండ అంటూ రామోజీ రాస్తున్నారు. రామోజీకి ఈనాడు పేపర్‌ పెట్టుకున్న ఇన్నేళ్లకు దళితులు గుర్తుకొచ్చారా? చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వెలి­వేతలు జరిగితే ఈనాడుకు ముచ్చటగా అనిపించా­యా? జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసినా ఎందుకు రాయలేదు?  అచ్చెన్నా­యు­డు మహిళను కాలితో తంతే ఏం చేశారు? గరగపర్రులో దళితుల వెలివేత, కారంచేడులో దళితులపై మారణ­హోమం జరిగినప్పుడు ఎందుకు రాయలేదు? నాడు దళితులపై జరిగిన దమనకాండకు కారకు­లైన నీ సొంత సామాజికవర్గం గురించి ఇప్పుడు రాయొచ్చు కదా రామోజీ’ అంటూ ప్రశ్నించారు.

‘ఫిల్మ్‌ సిటీ కోసం దళితుల భూముల్ని కబ్జా చేసినట్లు రామోజీపై ఇప్పటికీ కోర్టుల్లో కేసులు ఉన్నాయి. దళితులను మోసం చేసిన రామోజీ ఇప్పుడు చంద్రబాబుకు రాజకీయ పట్టం కట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. బాబు హయాంలో ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.33,625.49 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపితే దానిలో దేనికోసం ఖర్చుచేశారో? అవినీతి ఎంత జరిగిందో రాసే దమ్ము రామోజీకి ఉందా? అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో దళితుల సంక్షేమానికి రూ.51,293 కోట్లు ఖర్చు చేసింది. డీబీటీ ద్వారా పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతా­ల్లోకి నిధులు జమయ్యా­యి. ఈ మంచిపై రాయడానికి రామోజీకి చేతులు కదలడంలేదు. బాబు హయాంలో దళితులకు జరిగిన అన్యాయం, సీఎం జగన్‌ పాలనలో జరుగుతున్న న్యాయంపై చర్చకు మేము సిద్ధం’ అని మంత్రి సవాల్‌ విసిరారు. 

తప్పు చేసింది కాబట్టే ఎమ్మెల్యే శ్రీదేవికి భయం 
రాజకీయాల్లో అవకాశం కల్పిం చిన సీఎం జగన్‌ను, వైఎస్సార్‌సీపీని మోసం చేసింది కాబట్టే తాడికొండ ఎమ్మెల్యే  శ్రీదేవి భయపడుతోందని మంత్రి అన్నారు. చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్న ఆమె హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి చంద్రబాబు స్క్రిప్టు చదువుతోందన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)