Breaking News

పరిమళించిన మానవత్వం

Published on Wed, 07/02/2025 - 09:37

తూర్పు గోదావరి: ఏం చేస్తుందో ఆమెకు తెలియడం లేదు. ఎండైనా.. వానొచ్చినా మురుగు కాలువలోకి దిగి గంటల తరబడి ఉండిపోతోంది. ఎట్టకేలకు కొందరు చొరవ చూపడంతో.. ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని ఓ యువతి దయనీయ స్థితిలో మురికి కాలువలోనే రెండు రోజుల పాటు గడిపిన హృదయ విదారక సంఘటన కోరుకొండ బస్టాండ్‌ సెంటర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎక్కడి నుంచి వచ్చిందో, కోరుకొండలో ఆమె సంచరిస్తోంది. 

మతి స్థిమితం లేకపోవడంతో ఎవరైనా పెట్టింది తిని కాలం వెళ్లదీస్తోంది. రెండు రోజుల నుంచి స్థానిక బస్టాండ్‌ సెంటర్‌ను ఆనుకుని ఉన్న మురుగు కాలువలోకి దిగి, మళ్లీ బయటకు వస్తోంది. దుర్వాసన వస్తున్నా.. వ్యర్థాల మధ్యే రెండు రోజులుగా ఇలా చేస్తుండడాన్ని స్థానికులు గమనించారు. ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు ఈ కాలువ నుంచే గోదావరి నదిలోకి వెళ్తుంది. కొన్ని రోజులుగా కాలువకు వర్షపు నీరు రాకపోవడంతో ఆమెకు ఎటువంటి అపాయం కలగలేదు. 

కొందరు స్థానికులు ఈ విషయాన్ని పంచాయతీ వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పారిశుధ్య కార్మికులు మంగళవారం ఆమెను కాలువ నుంచి బయటకు తీసుకొచ్చారు. సైగలు చేస్తూ, పొడిపొడిగా మాట్లాడుతూ ఆమె భయంగా ఉంటోంది. పారిశుధ్య కార్మికులు జలడుగుల చిన్నపార్వతి, సోమాజుల బంగారమ్మ, రాజమహేంద్రవరానికి చెందిన డివైన్‌హ్యాండ్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆమె చికిత్స పొందుతోంది.

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)