Breaking News

హృదయం అద్దమనీ.. పగిలితే అతకదనీ..

Published on Thu, 06/05/2025 - 03:27

ఇష్టమైన వ్యక్తి చనిపోతే చూసి తట్టుకోలేక గుండె పట్టుకొని కూలిపోవడం వంటి దృశ్యాలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో జరిగేవే అంటున్నారు వైద్య నిపుణులు. నిజ జీవితంలోనూ ప్రియమైన వ్యక్తుల అకాల మరణం, అనారోగ్యం పాలైన విషయం తెలుసుకున్న సందర్భాల్లో తీవ్ర ఒత్తిడి, దుఃఖం, ఆవేదన వెంటాడతాయని, ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలు గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితినే బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ అని పిలుస్తారని వారంటున్నారు. ఇంతకీ బ్రోకెన్‌ హార్ట్‌ అంటే ఏంటి? దాని పరిణామాలు మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?   - సాక్షి, అమరావతి

టకోట్సుబో కార్డియో మయోపతి.. 
బ్రోకెన్‌ హార్ట్‌ ను వైద్య పరిభాషలో టకోట్సుబో కార్డియో మయోపతిగా పేర్కొంటారు. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అ­ధికం. అయితే మరణాల విషయంలో మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే రెట్టింపు ఉన్నట్లు పరిశోధకు­లు చెబుతున్నారు. ఈ విషయమై ఇటీవల అమెరిక­న్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఓ జర్నల్‌ను ప్రచురించింది.   

1.99 లక్షల మంది రోగులపై అధ్యయనం 
2016–2020 మధ్యలో అమెరికాలో 1,99,890 బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ మరణాలు సంభవించాయి. వీటిపై పరిశోధకులు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఈ క్రమంలో పురుషుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మరణాల రేటు 6.5 శాతంగా నమోదుకాగా, పురుషుల్లో 11.2, మహిళల్లో 5.5 శాతం మరణాలు సంభవించాయని అధ్యయనంలో వెల్లడించారు.  

ఆ వయస్కులవారికే అధికం  
సాధారణంగా బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ ప్రభావం 61 ఏళ్లు పైబడినవారిపైనే అధికం. 31–45 సంవ­త్సరాల వయసు గల వారితో పోలిస్తే 46–60 సంవత్సరాల వారిలో సమస్య  2.6 నుంచి 3.25 రెట్లు ఎక్కువ. టకోట్సుబో కార్డియో మయోపతి అనేది ప్రతికూల భావోద్వేగం, తీవ్రఒత్తిడితో కూ­డిన గుండె జబ్బు అని పరిశోధకులు వెల్లడించారు.  

సమస్య తలెత్తితే..  
బ్రోకెన్‌ హార్ట్‌ కారణంగా..గుండెలో కొంత భాగం తాత్కాలికంగా పెద్దదిగా మారుతుంది. రక్త ప్రసరణ నిలిచిపోతుంది. గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తాయి.

భావోద్వేగ మద్దతు అవసరం 
కావాల్సినవాళ్లు, అత్యంత ఆప్తులు దూరమైన సందర్భాల్లో కొందరు తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు గుండెపోటు సంభవిస్తుంది. ఇలాంటివారికి భావోద్వేగపరమైన మద్దతు అందించాలి. ఒత్తిడి నుంచి బయటపడేలా సహకారం అందించాలి.  – డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల నిపుణుడు, జీజీహెచ్, కర్నూలు 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)