Breaking News

కేంద్ర ఆర్థికమంత్రితో ఏపీ చాంబర్స్‌ ప్రతినిధుల భేటీ

Published on Wed, 10/25/2023 - 05:29

లబ్బీపేట (విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన పలు అంశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడలోని ఓ హోటల్‌లో సోమవారం సమావేశమైన వారు పలు అంశాలపై చర్చించారు.  మూడు పారిశ్రామిక కారిడార్లలో ప్రతిపాదించిన ఆరు ఇండస్ట్రీయల్‌ నోడ్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని, రాష్ట్రం కోసం ప్రతిపాదించిన మూడు మల్టీ మోడల్‌ ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ పార్కుల వేగవంతమైన అభివృద్ధి, ఫోర్ట్‌ లీడ్‌ ఎకానమీ అభివృద్ధికి తోడ్పాటు వంటి అంశాలపై చర్చించారు.

ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌రేటింగ్, సిబిల్‌ స్కోర్‌లను సులభతరం చేయడం, ఆలస్యమైన చెల్లింపుల సమస్య, ఎంఎస్‌ఎంఈ నుంచి తప్పనిసరి సేకరణ వంటి అంశాలను పరిష్కరించాలని సూచించారు. విజయవాడ నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని పునరుద్ధరించి, సర్వీసులు పెంచాలని, ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాలతో కార్గో సౌకర్యాలను అందించాలని ఆమెను కోరారు. విజయవాడ నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా ప్రాంతాలకు ప్రతిపాదిత వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

ఇంకా అనేక విషయాలు చర్చించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో  ఏపీ చాంబర్స్‌ ప్రెసిడెంట్‌ పొట్లూరి భాస్కరరావు, జనరల్‌ సెక్రటరీ బి రాజశేఖర్, సీఐఐ ఏపీ చాప్టర్‌ అధ్యక్షుడు లక్ష్మీప్రసాద్, ఆల్‌ ఇండియా మిర్చి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు వెలగపూడి సాంబశివరావు, ఏపీ ఎంఎస్‌ఎంఈ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు బాయన వెంకట్రావు, క్రెడాయ్‌ ఏపీ చాప్టర్‌ అధ్యక్షుడు రమణరావు, ఏపీ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌వీ స్వామి, కోవే ఏపీ చాప్టర్‌ అధ్యక్షురాలు రాధిక ఉన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)