Breaking News

పేదల మందులనూ వదలని గద్దలు

Published on Tue, 07/22/2025 - 03:36

సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. పారదర్శక విధానాలకు పాతరేసి, నిధులు దండుకోవడమే పరమావధిగా పథకాలు రూపొందిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వ బోధనాస్పత్రులకు జన్‌ ఔషధి మందుల సరఫరాను కూడా ఇప్పుడు చెరబట్టారు. గద్దెనెక్కిన వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఆదాయ మార్గాలపై ‘ముఖ్య’నేత, యువనేత, మంత్రులు కన్నేశారు. ఈ క్రమంలో బోధనాస్పత్రుల్లో పేదరోగులకు సరఫరా చేసే మందులు వారి కళ్లబడ్డాయి. అందులోనూ అవినీతికి స్కెచ్‌ వేశారు. సీఎం సొంత జిల్లాకు చెందిన జన్‌ ఔషధి మందుల సరఫరాదారులతో డీల్‌ కుదుర్చుకున్నారు. అనంతరం గత ప్రభుత్వం స్థానిక మందుల కొనుగోళ్ల కోసం ప్రవేశపెట్టిన కేంద్రీకృత విధానాన్ని ఎత్తేశారు. మందుల సరఫరా బాధ్యతను టెండర్లు లేకుండానే పయ్యావుల రవి, రాజశేఖర్‌కు కట్టబెట్టారు.  

నాడు పూర్తి పారదర్శకంగా 
బోధనాస్పత్రులకు మందుల కొనుగోలు కోసం కేటాయించే బడ్జెట్‌లో 80 శాతం నిధులను సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్‌ఐడీసీ) సరఫరా చేసేందుకు కేటాయిస్తుంది. మిగిలిన 20 శాతం బడ్జెట్‌ను అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం వినియోగిస్తారు. 2022 జూలైలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యవసర మందుల సరఫరాకు కేంద్రీకృత విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా టెండర్లు ఆహ్వానించి ఎక్కువ రాయితీపై మందులు సరఫరా చేసే సంస్థను ఎంపిక చేసింది.

ఎంఆర్‌పీపై 35.6 శాతం రాయితీతో ఎల్‌–1గా నిలిచిన సంస్థకు కాంట్రాక్ట్‌ ఇచ్చింది. అత్యవసర మందులతోపాటు కొన్ని సందర్భాల్లో 80 శాతం బడ్జెట్‌లోని ఎసెన్షియల్‌ డ్రగ్స్‌లో అందుబాటులో లేని మందులనూ సరఫరా చేసేలా అనుమతి ఇచ్చింది. తద్వారా లోకల్‌ టెండరింగ్‌లో నడిచే అవినీతి, అక్రమాలతో పాటు ఆస్పత్రుల్లో మందుల కొరతను అరికట్టేలా చర్యలు తీసుకుంది. ఈ విధానంలో ఆస్పత్రుల్లో మందులకు ఇండెంట్‌ పెట్టిన దగ్గర నుంచి సరఫరా సంస్థకు బిల్లుల చెల్లింపు వరకు ప్రతి దశలో ఉన్నతస్థాయి పర్యవేక్షణతో పాటు జవాబుదారీతనం ఉండేది.   

అవినీతికి మార్గం సుగమం   
జన్‌ ఔషధి మందుల సరఫరాలో దోపిడీకి స్కెచ్‌ వేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు కేంద్రీకృత కాంట్రాక్ట్‌ విధానంపై దు్రష్పచారం చేశారు. అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ అమాత్యుడి కార్యాలయం నుంచి లీకులు ఇచ్చి ఎల్లో మీడియాలో కథనాలు రాయించారు. అనంతరం స్థానిక కొనుగోళ్ల విధానం పునరుద్ధరిస్తూనే జన్‌ ఔషధి  కొనుగోళ్ల విధానం ప్రవేశపెట్టి అవినీతికి మార్గం సుగమం చేసుకున్నారు. అధికారులకూ లంచాలు ముట్టడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు పయ్యావుల సోదరులకు మేలు చేసేలా మార్గదర్శకాలు ఇచ్చారు. నాణ్యత లేని మందులు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)