Breaking News

పేద ప్రజలకు చేరువగా వైద్యం

Published on Sun, 07/09/2023 - 04:39

గుడివాడ టౌన్‌: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు సీఎం జగన్‌ కూడా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ వంటి పథకాలతో ఇప్పటికే ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేశారని పేర్కొన్నారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో రూ.10.28 కోట్లతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఏరియా ఆస్పత్రి బ్లాక్‌–2 భవనాన్ని ఆమె ప్రారంభించారు.

తొలుత ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ వైఎస్సార్‌ జయంతి రోజున 100 పడకల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన దేశంలో ఒక చరిత్ర సృష్టించిందన్నారు.

పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్య సేవలందించాలనే సంకల్పంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి సేవలందిస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్‌ వైద్య రంగం మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గతంలో ఏరియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో రోగులు ఇబ్బందులు పడేవారని వివరించారు.

తాము అధికారంలోకి రాగానే ఆస్పత్రి దుస్థితిని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన వెంటనే స్పందించి రూ.10 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. 22మంది వైద్యులు, 80 మందికి పైగా నర్సులు, ఇతర సిబ్బందితో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. పలువురు అధికారులు, నేతలు పాల్గొన్నారు.

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)