Breaking News

జలపాతంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం

Published on Tue, 09/24/2024 - 04:50

మారేడుమిల్లి: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని పర్యాటక ప్రదేశమైన జలతరంగిణి జలపాతంలో ఆదివారం గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం వేకువజామున జలపాతం సమీపంలోని తుప్పల మధ్య కె.సౌమ్య (21), బి.అమృత (21) మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. గల్లంతైన మరో విద్యార్థి సీహెచ్‌ హరదీప్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఏలూరు ఆశ్రం మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సెకండియర్‌ విద్యార్థులు 14 మంది ఆదివారం మారేడుమిల్లి వచ్చారు. జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా జలపాతం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. ప్రవా­హంలో సీహెచ్‌ హరదీప్, కె.సౌమ్య, బి.అమృత కొట్టుకుపోగా.. గాయత్రీపుష్ప, హరిణిప్రియ అనే విద్యార్థినులు జలపాతానికి 6 కిలోమీటర్ల సమీపంలో చెటుకొమ్మకు చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.

లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. హరదీప్‌ ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందా­లు, రెవెన్యూ, అటవీ, పోలీస్‌ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)