Breaking News

వైద్య విద్యార్థులకు చంద్రబాబు సర్కార్‌ వెన్నుపోటు

Published on Fri, 12/05/2025 - 10:51

సాక్షి, అమరావతి: పీజీ సీట్లు అమ్మకానికి పెట్టిన కూటమి సర్కార్‌పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాను వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకు వెన్నుపో­టు పొడిచారు. ఒకవైపు 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. మరోవైపు ఆ కాలేజీల్లోని పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశా­రు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రారంభిం­చిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఒక్కో పీజీ సీటుకు రూ.29 లక్షల వసూలుకు సీఎం చంద్రబాబు ఆమో­­దం తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రభుత్వ కోటా సీటుకు రూ.30 వేలు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీటుకు రూ.9 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు రూ.29 లక్షలుగా ఫీజులు ఖరారు చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4 కోర్సు­ల్లో 60 పీజీ సీట్లను నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) మంజూరు చేసింది.

రాజమండ్రి, నంద్యాల కళా­శాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళా­శాలలో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నా­రు. కాగా, 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు పోగా, మిగిలిన 50 శాతం సీట్లను రాష్ట్ర కోటాలో యూని­వర్సిటీ భర్తీ చేయనుంది. ఈ 50 శాతంలో సగం కన్వీనర్‌ కోటాకు, 35 శాతం సెల్ఫ్‌ఫైనాన్స్, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాకు కేటాయించారు.

 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)