Breaking News

నీట్‌గా మీ­ట్‌

Published on Mon, 07/29/2024 - 05:27

ఆహారం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో రోజురోజుకు అవగాహన పెరుగుతోంది. ప్రజల అభిరుచికి తగ్గట్లే వ్యాపారస్తులు కూడా అధునాతన సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే పట్టణాల్లో సంతలు సూపర్‌ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక మాంసం దుకాణాలు కూడా నీట్‌గా మారుతున్నాయి. బహుళజాతి సంస్థలతో పాటు స్థానిక వ్యాపారులు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి నీట్‌నెస్‌ మెయింటైన్‌ చేస్తున్నారు. 

అలాంటి మాంసాహార ఉత్పత్తులు కొనడానికే ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. మాంసాహార ఉత్పత్తులను కొన్ని సంస్థలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటికి దీటుగా పట్టణ ప్రాంతాల్లో తాజా, ఫ్రోజెన్‌ ఉత్పత్తులు అందించడానికి నాన్‌ వెజ్‌ స్టోర్స్, మార్ట్‌ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు.    – సాక్షి, అమరావతి

మీట్‌ మార్ట్‌కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఔత్సాహికులు పెట్టుబడులు పెడుతు­న్నారు. కొందరు నేరుగా మార్టులు నడుపుతుంటే.. మరి కొందరు ఫ్రాంచైజీ తరహాలో ఈ మార్ట్‌­ల­ను విస్తరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ముందుకొస్తున్నారు. కేవలం చేపలు, కోడి, మేక మాంసాలకే పరిమితం కాకుండా అన్ని రకా­ల మాంసాహార ఉత్పత్తులు ఒకే చోట అందిస్తు­న్నా­రు. 

ప్రస్తుతం ఈ తరహా మార్ట్‌లు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 50కు పైగా ఉన్నాయి. ఈ మార్టుల ద్వారా రాష్ట్రంలో రోజుకు సగటున ఐదారు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగు తోందని అంచనా వేస్తున్నారు. ఉన్నత, ఎగువ మధ్య తరగతి ప్రజలుండే ప్రాంతాలే లక్ష్యంగా మార్టుల యజమానులు షాప్స్‌ ఓపెన్‌ చేస్తు న్నారు. విశాఖ, విజ­య­వాడ, గుంటూరు, రాజ­మండ్రి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి వంటి నగరాల్లో ఇవి బాగా విస్తరిస్తున్నా­యి.

మీట్‌ మార్టుల ప్రత్యేకతలు ఇవే.. 
» కబేళాలతో పాటు డ్రెస్సింగ్, ప్యాకింగ్‌ ఇలా ప్రతీ దాంట్ అంతర్జాతీయ ప్రమాణాలు
» పరిసరాలన్నీ అత్యంత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌
» వచ్చే ప్రతీ కస్టమర్‌ కళ్లెదుటే వారికి కావాల్సినట్టుగా కట్‌ చేసి ప్యాకింగ్‌
» మటన్, చికెన్, ఫిష్‌ తదితరాలకు ఏ పార్ట్‌ (భాగం) కావాలంటే ఆ పార్టులు వేరుగా విక్రయం 
» బిర్యానీ, తందూరీ వంటి వంటకాలకు తగినట్టుగా కట్‌ చేసి ప్యాకింగ్‌
» రెడీ టూ కుక్‌కు వీలుగా మసాలాలు అద్ది మరీ అందించడండోర్‌ డెలివరీకి ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌

» రాష్ట్రంలో మీట్‌ మార్టులు  50
» రోజుకు సగటున జరుగుతున్న వ్యాపారం (రూ. కోట్లలో) 5- 6 
» ఒక్కో మీట్‌ మార్టుకు పెట్టుబడి (రూ.ల్లో) 30 - 50 లక్షల వరకు

శుచి, శుభ్రత ముఖ్యం
శుచి, శుభ్రత ఉంటే కాస్త ధర ఎక్కువైనా వెనుకా­డడం లేదు. విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఫిష్, మటన్‌ మార్ట్‌లు అందుబా­టులోకి వచ్చాయి. బ్రతికున్న చేపలే కాదు.. శుభ్రమైన వాతావరణంలో కోడి, మేక మాంసంతో పాటు తాజాగా బతికి ఉన్న అన్ని రకాల రొయ్యలు ఈ మార్టుల్లో దొరుకుతున్నాయి. –ఎం.హరినాథ్, రిటైర్డ్‌ డీఈ,  పంటకాలవ రోడ్, విజయవాడ

ప్రజల్లో ఆదరణ బాగుంది
గత కొన్నేళ్లుగా మత్స్య ఉత్పత్తులను విదేశాలకు ఎగు­మతి చేస్తున్నాను. రెండేళ్ల క్రిత­ం ఈ రంగంలోకి అడుగు పెట్టా. తొలుత విశాఖలో ది హైపర్‌ మీట­న్‌ స్టోర్‌ ఏర్పాటు చేశాను. ప్రస్తుతం విశాఖలో నాలుగు, కాకినాడ, విజయవాడల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఒక్కో మార్ట్‌కు రూ. 40 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 50 మందికి ఉపాధి కల్పించా. నెలకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్ష­ల వరకు అమ్మ­కాలు జరుగుతున్నాయి. ప్రజలు ఇప్పు­డిప్పుడే అలవాటు పడుతున్నారు. ఆదరణ బా­గానే ఉంది. ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు కూడా అవకా­శం ఉంది. డోర్‌ డెలివరీ చేస్తున్నాం. భవిష్యత్‌లో మిగిలిన నగరాల్లో కూడా విస్తరించే దిశగా ముందుకెళ్తున్నాం. – పసల పర్వేష్, ఎం.డీ, హైపర్‌ మీటన్‌ స్టోర్‌

Videos

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)