Breaking News

సముద్రంలో ఈతకు వెళ్లి ఎంబీబీఎస్‌ విద్యార్థి గల్లంతు

Published on Mon, 02/03/2025 - 04:06

ముత్తుకూరు(నెల్లూరు జిల్లా)/కోనేరుసెంటర్‌ (మచిలీపట్నం) : స్నేహితులతో కలిసి సముద్రంలో ఈతకెళ్లి ఓ ఎంబీబీఎస్‌ విద్యార్థి గల్లంతయ్యాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పట్టపుపాళెం ఏపీజెన్‌కో బ్రేక్‌ వాటర్స్‌ వద్ద ఈ ఘటన జరిగింది. కృష్ణపట్నం సీఐ రవినాయక్, ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలు.. నెల్లూరులో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 9 మంది విద్యార్థులు ఆదివారం నేలటూరు పట్టపుపాళెం సముద్ర తీరానికి విహారానికి వెళ్లారు. 

ఆటపాటలతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వీరిలో విశాఖపటా్ననికి చెందిన షణ్ముగనాయుడు(19) ఈతకొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు లోతు ఉన్న చోట సముద్రపు నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. స్థానికులతో కలిసి రక్షించేందుకు ప్రయత్నించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విశాఖలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 30 మందికి పైగా మత్స్యకారులు పడవల ద్వారా షణ్ముగనాయుడి కోసం గాలించారు. మరో ఐదుగురు గజ ఈతగాళ్లను కూడా రప్పించారు. సాయంత్రం చీకటిపడే వరకూ అన్వేషించినా ఫలితం లేకపోయింది.   

మత్స్యకారుడు గల్లంతు 
కృష్ణా జిల్లా మచిలీపట్నం బండలం మంగినపూడి బీచ్‌లో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. బందరు మండలం సత్రవపాలేనికి చెందిన చింతా ఏడుకొండలు శనివారం సాయంత్రం తోటి మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. సముద్రంలో చేపలు పడుతుండగా రాత్రి 12 గంటల సమయంలో వలలాగే క్రమంలో సముద్రంలో పడిపోయాడు.

బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారులు ఏడుకొండలును కాపాడేందుకు సముద్రంలోకి దూకి గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వేట ఆపి ఆదివారం ఉదయాన్నే ఒడ్డుకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)