Breaking News

ఓఎంసీ ఓర్‌ ఊడ్చేస్తున్నారు

Published on Wed, 08/14/2024 - 06:00

రాయదుర్గం: ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీలో సీబీఐ సీజ్‌ చేసిన విలువైన ఐరన్‌ ఓర్‌ (ఇనుప ఖనిజం)ను పచ్చముఠాలు చీకటి మాటున తరలించేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలంలోని ఓబుళాపురం మైనింగ్‌  కంపెనీ (ఓఎంసీ)లో తవ్వకాలు నిలిపివేసి సుమారు 8లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని 2011లో సీబీఐ సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. 

దీనిపై కన్నేసిన టీడీపీ నాయకులు నాలుగైదు రోజులుగా ఓఎంసీలోకి చొరబడి లారీల్లో ఇనుప ఖని­జాన్ని చీకటి పడగానే సమీప స్టీల్‌ ఫ్యాక్టరీల్లోకి తరలిస్తు­న్నారు. అర్ధరాత్రి వేళ కొండ ప్రాంతాల్లో లారీల సం­చారం, లైట్లను గమనించిన స్థానికులు ఓఎంసీలో దొంగలు పడ్డారని చర్చించుకుంటున్నారు. రోజుకు సుమారు 4 వేల టన్నులు మాయం అవుతున్నట్లు సమాచారం. 

నాణ్యతను బట్టి టన్ను రూ.4 వేల వరకు విక్రయిస్తుండడంతో భారీగా లూటీ చేసి­నట్లు అంచనా. ఓఎంసీలో లభ్యమయ్యే ఇనుప ఖని­జం నాణ్యతకు పేరు పొందింది. దీన్ని కాజేసేందుకు టీడీపీ నేతలు పథకం ప్రకారం వ్యవహరించారు. ఇందులో భాగంగా ఎల్లో మీడియాలో తప్పు­డు కథనాలు రాయించారు. సీబీఐ సీజ్‌ చేసిన ఇనుప ఖనిజం గత ప్రభుత్వ హయాంలోనే తరలి పోయిందంటూ తప్పుడు కథనాలను వండి వార్చారు.   

నిస్సహాయంగా పోలీసులు.. 
ఓఎంసీలో ఇనుప ఖనిజం తరలిపోతున్నా పోలీసులు కళ్లప్పగించి చూడటం మినహా చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. లాఠీ ఝుళిపిస్తే బదిలీ తప్పదనే భయం వారిని వెంటాడుతోంది. ఇనుప ఖనిజాన్ని టీడీపీ నాయకులు అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం ఇటీవల బహిర్గతం చేశారు. గత ప్రభుత్వంలో దోచేసినట్టు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. దోపిడీ అంశాన్ని సీబీఐ డైరెక్టర్‌తో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెస్తామన్నారు.  

ఎవరి ప్రమేయం ఉన్నా వదిలి పెట్టం
ఓఎంసీలో సీజ్‌ చేసిన ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలి పెట్టేది లేదు. సత్వరం ఓ బృందాన్ని అక్కడికి పంపి దర్యాప్తు చేయిస్తాం. సీబీఐ పరిధిలో ఉన్న వ్యవహారంలో తల దూర్చితే తీవ్ర పరిణామాలు తప్పవు. లారీ యజమానులు ఆలోచించి బాడుగకు వెళ్లాలి. ఏమాత్రం పట్టుబడినా అక్కడే సీజ్‌ చేస్తాం. అంగుళం కూడా కదలనివ్వం. నిల్వ ఉంచిన ఖనిజం బాగున్నా, పాడైనా బయట వ్యక్తులు ఎవరూ తాకటానికి వీల్లేదు. పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖలను అప్రమత్తం చేసి అడ్డుకట్ట వేస్తాం. – నాగయ్య, మైనింగ్‌ డీడీ, అనంతపురం 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)