Breaking News

పెళ్లింట్లో భారీ చోరీ

Published on Thu, 01/23/2025 - 05:23

అనంతపురం: పెళ్లింట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ.3.50 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అనంతపురం నగరంలోని ఓ ఇంట్లో బుధవారం వేకువజామున ఈ భారీ చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం మండలం కాట్నేకాలువ గ్రామా­నికి చెందిన కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి నగరంలో స్థిరపడ్డారు. భూములు అధికంగా ఉండడంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. 

కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన బుసిరెడ్డి ఆదినారాయణరెడ్డి కుమారుడితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 7న అనంతపురం ఎంవైఆర్‌ కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. 

ఈ నేపథ్యంలోనే పెళ్లి కుమార్తెకు బహుమతిగా ఇవ్వనున్న బంగారం, వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు చెందిన బంగారంతో పాటు వెంకట శివారెడ్డి అత్త, మామ, వియ్యంకుల బంగారు ఆభరణాలు కలిపి సుమారు 5 కిలోల బంగారాన్ని ఇంట్లోని లాకర్‌లో ఉంచారు. కాగా.. శివారెడ్డి దంపతులు తెలంగాణలో ఉన్న తమ బంధువుల్ని పిలిచేందుకు వెళ్లగా.. ఇదే అదునుగా భావించిన దొంగలు బుధవారం వేకువజామున 4 గంటలకు ఇంట్లోకి చొరబడ్డారు. 

ఊచలు తొలగించి ఇంట్లోకి వెళ్లి తొలుత బీరువా తాళాలు పగులగొట్టారు. అందులో ఉన్న లాకర్‌ తాళం తీసుకుని.. లాకర్‌లోని సుమారు ఐదు కిలోల బంగారాన్ని, బీరువాలోని రూ.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం ఐదుగురు దొంగల ముఠా చోరీలో పాల్గొన్నట్టు సీసీ కెమెరాల ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. ఇంట్లో సీసీ కెమెరాలు లేనప్పటికీ ఎదురింటి సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. 

మరో రెండు ఇళ్లలోనూ చోరీ 
కాగా.. వెంకటశివారెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న డిప్యూటీ కమిషనర్‌ ఇంట్లో రూ.75 వేలు, మిస్టర్‌ ఛాయ్‌ నిర్వాహకుడు ఇంట్లోనూ చోరీ జరిగింది. వీరు ఇంకా ఇళ్లకు చేరుకోకపోవడంతో అందులో ఎంత మొత్తం చోరీ జరిగిందనే అంశంపై స్పష్టత రాలేదు. ఘటన స్థలంలో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఈ చోరీ వెనుక తెలిసిన వారి హస్తం ఉందా? లేక రాటుదేలిన దొంగల ముఠా పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)