Breaking News

రెండే నెలలు గడువు.. లేకపోతే సమ్మె

Published on Fri, 03/07/2025 - 05:36

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా హామీలు అమలు చేయకపోవడంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా రెండు నెలల్లో జీవోలు జారీ చేయాలని, లేకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు గురువారం విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. 

ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ ధర్నాకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆశాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ, ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నర్సింగరావు, కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా అశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. 

పని ఒత్తిడితో ఆశా వర్కర్లు అనారోగ్యం పాలవుతున్నా సెలవులు ఇవ్వడం లేదన్నారు. మెటర్నిటీ లీవులు కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పని ఒత్తిడి, వెట్టిచాకిరీ వల్ల ఆనారోగ్యం బారినపడి ఇటీవల కాలంలో అనేక మంది ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. బీమా కంపెనీలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో క్లెయిమ్‌లు నిలిచిపోయాయని, బాధిత కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సాయం అందక రోడ్డునపడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. 

ఆశా వర్కర్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఒక్క పైసా కూడా ఇప్పటివరకు చెల్లించడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సంఘ రాష్ట్ర నాయకులు ఎ.కమల, ఎ.వెంకటేశ్వరరావు, పద్మ, రాఘవమ్మ, ధనశ్రీ, లక్ష్మి, సౌభాగ్య, సుభాషిణి, అమర, సుధారాణి, పార్వతి, రమణకుమారి, గంగా, జ్యోతి, వెంకటలక్ష్మి, వెంకటేశ్వరమ్మ, వాణిశ్రీ, తదితరులు మాట్లాడారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)