Breaking News

నల్లమలలో కార్చిచ్చు

Published on Fri, 02/20/2026 - 05:38

అచ్చంపేట: నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో కార్చిచ్చు రాజుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట రేంజ్‌ వటువర్లపల్లి, ఈగలపెంట బీట్‌ పరిధిలోని తాటిగుండాల సెక్షన్‌లో తవిసిపెంట, వజ్రాలమడుగు ప్రాంతంలో సుమారు 60 హెక్టార్ల విస్తీర్ణంలో అడవికి నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిప్పుంటుకోగా గురువారం అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

శాటిలైట్‌ ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఫైర్‌ వాచర్లు, బేస్‌ క్యాంపు వాచర్లు, టైగర్‌ ట్రాకర్లు, బీట్‌ అధికారులు, శిక్షణాధికారులు బ్లోయర్ల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. చీకటి పడటంతో బుధవారం రాత్రి మంటలు అదుపులోకి తేలేకపోయారు. హైదరాబాద్‌ – శ్రీశైలం జాతీయ రహదారి పక్క నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర మంటలు విస్తరించాయి. మంటలు చెలరేగిన ప్రాంతంలో ఎత్తయిన కొండలు, లోయలు ఉన్నాయి. దీంతో నడవలేని పరిస్థితి వల్ల మంటలు ఆర్పడం కొంత కష్టంగా మారింది.

గురువారం ఎఫ్‌ఆర్‌వో గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన 20 మంది సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రాంతాల్లో గడ్డి, రాళ్లు ఎక్కువగా ఉండడంతో మంటలు చెలరేగాయి. పశువులు, గొర్రెల కాపరులు నిప్పు పెట్టడం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 30 హెక్టార్ల విస్తీర్ణంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ఇందులో గడ్డి మాత్రమే కాలిందని, చెట్లకు ఎలాంటి నష్టం జరగలేదని అటవీ శాఖ స్పష్టం చేసింది.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)