Breaking News

ఏలూరు: మంటల్లో దగ్దమైన నివాసాలు.. పలువురికి గాయాలు

Published on Sat, 01/25/2025 - 07:04

సాక్షి, మండవల్లి: ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇళ్లలోకి దోమలు రాకుండా వెలిగించే అగర్‌బత్తి కారణంగా మంటలు చెలరేగడంతో 20 గుడిసెలు కాలిపోయి.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను వెంటనే కైకలూరు ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని మండవల్లి మండలం భైవరపట్నం ప్రత్తిపాడు స్టేజీ వద్ద 20 ఏళ్లుగా నెల్లూరుకు చెందిన కొంత మంది పిట్టలు కొట్టే వాళ్లు నివసిస్తున్నారు. స్థానికంగా ఉండే ఆక్వా చెరువులపై నాటు తుపాకీలతో పిట్టలను బెదిరిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. కాగా, శుక్రవారం రాత్రి 9.45 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ క్రమంలో అక్కడ గుడిసెలో నిద్రిస్తున్న షారుక్‌ఖాన్, వంశీ, అను, కార్తీక్, విక్కీలతోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒక బాలుడు, మరో మూడేళ్ల చిన్నారి ఉన్నారు.

అయితే, పిట్టలను బెదిరించడానికి ఉపయోగించే మందుగుండు సామగ్రికి నిప్పు అంటుకోవడంతోనే పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దఎత్తున మంటలు, పొగతో పక్కనే ఉన్న 20 గుడిసెలకు క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో గుడిసెల్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో భారీ శబ్ధం వచ్చింది. ఎడిసిపడిన మంటల కారణంగా గుడిసెల్లోని వస్తువులు, పక్కనే ఉన్న వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

పత్తాలేని అగ్నిమాపక సిబ్బంది.. 
పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందుతున్నా వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెంటనే చేరుకోలేదు. ఆకివీడు నుంచి గంటన్నర  తర్వాత వచ్చిన వాహనం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. 108 వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులను తరలించాల్సిన దుస్థితి నెలకొంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)