కాకినాడ: వేట్లపాలెంలో భారీ పేలుడు..23 మంది సజీవ దహనం

Published on Sat, 02/28/2026 - 15:01

సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శనివారం  సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీగా ఎగిసి పడుతున్న మంటల్లో చిక్కుకుని  23 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన  వ్యక్తమవుతోంది.  పేలుడుధాటికి మృత దేహాలు స్థానిక  పంట పొలాల్లోకి  ఎగిరిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.

అందిన సమాచారం మేరకు మృతుల వివరాలు : అడబాల శ్రీను, కడిపల్లి కృపమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గోడత మహేష్‌, మందపల్లి చిన్ని, నిమ్మడ కరుణ, గొట్ట మహేష్‌, రమణ, నానిలు ఉన్నారు.

డీఎన్‌ఏ  టెస్టుల ఆధారంగా మృతదేహాల అప్పగింత
డీఎన్‌ఏ  టెస్టుల ఆధారంగా మృతదేహాలను అప్పగించే పనిలో పడ్డారు అధికారులు. డీఎన్‌ఏ రిపోర్టులు వచ్చిన  తర్వాత మృతదేహాలను అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.

కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. మంటల్లో 50 మంది..!

ప్రమాదం  సమయంలో 70 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం.  పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి.  సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు సహాయక చర్యల్ని చేపట్టాయి. ఘటనా స్థలంలో బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి. 

గతంలో భారీ పేలుళ్లు, విషాదాలు 
బాణసంచా తయారీ సందర్భాల్లో అనేక ప్రమాదాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి.  బాణా సంచా తయారీకి  ప్రసిద్ధి చెందిన  వేట్లపాలెం, పరిసర గ్రామాల్లో ఇలాంటి భారీ ప్రమాదాలు జరగడం,  పలువురు కార్మికులు  ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, వేళంగి, రాయవరం, వి.సావరం, కొమరిపాలెం, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి వ్యాపారులకు చేతినిండా పని ఉంటుంది. బాణసంచా తయారీ కోసం ఫారమ్‌ 20, కేవలం అమ్మకం కోసం ఫారమ్‌ 24 జారీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్‌డ్‌ తయారీ కేంద్రాలు ఉన్నాయి.

జిల్లాలోని మండపేట, జువ్విపాడు, ద్రాక్షారామం, కొమరిపాలెం, రాయవరం, బిక్కవోలు, యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప తదితర చోట్ల బాణసంచా కేంద్రాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వాకతిప్పలో 2014 అక్టోబర్‌ 22వ తేదీన చోటు చేసుకున్న ఘటన ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన అనేక లోపాలను ఎత్తిచూపింది. 

కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో  కిరాణా షాపులో బాణసంచా పేలి భార్యాభర్తలు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి మృతిచెందారు. అలాగే గత ఏడాది రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్‌ ఫైర్‌ వర్క్స్‌లో జరిగిన భారీ పేలుడులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు  అక్కడిక్కడే మరణించారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)