Breaking News

టీడీపీ వర్సెస్‌ టీడీపీ

Published on Tue, 07/21/2026 - 05:38

మార్కాపురం: భూమి, రహదారి వివాదం అధికార తెలుగు­దేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే గల్లా మాధవికి చెందిన భ్రమరా టౌన్‌ షిప్‌ యాజమాన్యం వర్గానికి, మార్కాపురం పట్టణానికి చెందిన టీడీపీ నేత చిలకపాటి చిన్న వెంకట చెన్నయ్య వర్గానికి మధ్య రహదారిపై గేట్, కంచె నిర్మాణం విషయంలో వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంపై ఆదివారం రెండు వర్గాలు ఘర్షణ పడటంతో నలుగురికి గాయాలయ్యాయి. మార్కాపురంలోని పూల సుబ్బయ్య కాలనీకి తూర్పున భ్రమరా టౌన్‌షిప్‌ వెంచర్‌ ఉంది. 167 ఎకరాల్లోని ఈ వెంచర్‌ గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుకు చెందినదిగా సమాచారం.

వెంచర్‌ ముందు భాగంలో మార్కాపురం టీడీపీ నేత చిలకపాటి చిన్న వెంకట చెన్నయ్యకు ఆరు ఎకరాలు, మరికొందరికి భూములు ఉన్నట్లు సమాచారం. ప్రధాన రహదారి నుంచి 200 మీటర్ల లోపల ఉన్న భ్రమరా టౌన్‌షిప్‌నకు వెళ్లే మార్గం విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. వెంచర్‌ యాజమాన్యం గతంలో ఉన్న 30 అడుగుల మెటల్‌ రోడ్డును విస్తరించి 50 అడుగుల రహదారిగా చేసేందుకు రెండువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలోని భూముల యజమానులు తమ స్థలాలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

చిలకపాటి చిన్న వెంకట చెన్నయ్య ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు, షేక్‌ ఇంతియాజ్, షేక్‌ ఇలియాజ్‌ సుమారు 30 మందితో రహదారిపై ధర్నా కూడా చేశారు. ఆదివారం భ్రమరా టౌన్‌షిప్‌ మేనేజర్‌ విఠల్, శ్రీనివాస్‌ చౌదరి ఆధ్వర్యంలో గేటు నిర్మాణం చేపట్టారు. ఈ పనులను చెన్నయ్య వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మార్కాపురం టౌన్‌ పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత ఇనుప గేట్లను కొందరు పక్కనే ఉన్న చెరువులో పడే­సినట్లు సమాచారం.

సాయంత్రం ఆ గేట్లను బయటకు తీసేందుకు మేస్త్రి మీరావలి ఆధ్వర్యంలో కూలీలు చెరువులోకి దిగగా,  చెన్నయ్య వర్గం అడ్డుకొంది. దీంతో రెండువర్గాల మధ్య మరో­సారి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మేస్త్రి పాణ్యం మీరావలి, అనిల్‌కు గాయాలయ్యాయి. చెన్నయ్య వర్గానికి చెందిన అనకరి మల్లికార్జున, అంబడిపూడి కిరణ్‌కు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మార్కాపురం టౌన్‌ పోలీసులు విచారణ చేప­ట్టారు. కేసులు నమోదు కాలేదని, విచా­రణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై సోమవారం దళితులు, స్థల యజమానులు పీజీఆర్‌ఎస్‌కు వెళ్లి జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులుకు వినతిపత్రం అందించి ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

ఎమ్మెల్యే నారాయణరెడ్డే దాడి చేయించారు : ఎమ్మెల్యే గల్లా భర్త 
తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై మార్కాపురం ఎమ్మెల్యే నారా­యణరెడ్డే దాడి చేయించారని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు ఓ ప్రకటనలో ఆరోపించారు. అధికారు­లతో కుమ్మక్కై భ్రమరా వెంచర్‌ను ధ్వంసం చేశారని, సంస్థ ప్రతి­నిధులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. మార్కా­పురం జేసీ పులి శ్రీనివాస్‌ కూడా తమపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆయన అవినీతిని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నించడంతో ఇప్పుడు వేధిస్తున్నారని ఆరోపించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)